స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోమారు గాయకుడిగా పలకరించబోతున్నాడు. అప్పుడెప్పుడో `వేదం`(2010) కోసం `ప్రపంచం నా వెంట వస్తుంటే` అంటూ సాగే వెస్ట్రన్ టచ్ ఉన్న రొమాంటిక్ సాంగ్ లో తన గొంతుని సవరించిన బన్నీ… త్వరలో ఓ జానపద గీతాన్ని తన నోట వినిపించబోతున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం బన్నీ `అల వైకుంఠపురములో` అనే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. థమన్ బాణీలు అందిస్తున్నాడు. కాగా… ఇప్పటికే `సామజవర గమన`, `రాములో రాములా` రూపంలో రెండు చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించిన థమన్ … తాజాగా ఓ ప్రత్యేక జానపద గీతాన్ని కూడా రూపొందించారట. ఈ పాటనే బన్నీ ఆలపించాడని టాక్. సినిమాలో ప్రత్యేక సందర్భంలో వచ్చే గీతమని… బన్నీ అభిమానులను అలరించేలా ఈ పాట ఉంటుందని సమాచారం. అయితే, ఈ గీతం సినిమాలో మాత్రమే కనిపిస్తుందని, వినిపిస్తుందని తెలిసింది.
మరి… ప్రసిద్ధ శ్రీకాకుళం జానపద గీతానికి మరో వెర్షన్‌లా రానున్న ఈ పాట వెండితెరపై ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం… విడుదల తేదీ అయిన 2020 జనవరి 12 వరకు వేచిఉండాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: