ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 22
మహేష్ బాబు పాన్ - ఇండియా ఫిల్మ్?
మరోసారి జట్టుకట్టిన కృష్ణవంశీ, ఇళయరాజా
స్పెషల్ డేన రానున్న ‘అఖిల్ 4’?
కారు ప్రమాదం గురించి రాజశేఖర్ వివరణ
ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన చెర్రీ

#RT66 ప్రారంభానికి ముహూర్తం ఖరారు

తేజ డేరింగ్ డెసిషన్ - ఆర్టికల్ 370పై సినిమా..!
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్
మహేష్ బాబు ట్వీట్ కు కమల్ హాసన్ రీ ట్వీట్

'కార్తికేయ 2' కోసం భారీ బడ్జెట్
బిజీ షెడ్యూల్ లో రానా దగ్గుబాటి

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో అల్లరి నరేష్..!
బాలీవుడ్ డెబ్యూ - నాలుగు భాషల్లో..!
భక్తిరస చిత్రంలో నయనతార
కోర్టు సన్నివేశాల్లో ‘ఆర్ ఆర్ ఆర్’
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
సొంత ప్రొడక్షన్ లో యంగ్ హీరో సినిమా - క్లారిటీ ఇచ్చిన రానా..!
గతకొద్ది కాలంగా బ్రేక్ లో వున్న టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రానా ఇప్పుడు మళ్ళీ బిజీ కాబోతున్నాడు. ఇప్పటి వరకూ పెండింగ్ లో వున్న పనులతో బిజీ కాబోతున్నాడు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రానా మాట్లాడుతూ.. హిందీ మూవీ హాథీ మేరే సాథీ మూవీ కి డబ్బింగ్ చెబుతున్నాను.. ఆ మూవీ మూడు భాషలలో రిలీజ్ కానుందని, మూడు భాషలలో డబ్బింగ్ చెప్పడం అంత ఈజీ కాదు.. మరోపక్క హిరణ్య కశిప మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూస్తున్నాను.. ఆ మూవీ కై కొన్ని సెట్స్ రూపొందిస్తున్నాం.. డిసెంబర్ నెలలో విరాటపర్వం షూటింగ్ లో జాయిన్ అవుతానని తెలిపాడు.
మహేష్ బాబు పాన్ - ఇండియా ఫిల్మ్?
ఇప్పుడంతా పాన్ - ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ప్రతీ స్టార్ హీరో కూడా అలాంటి చిత్రాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే... సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ కి ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్.
మరోసారి జట్టుకట్టిన కృష్ణవంశీ, ఇళయరాజా
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ… తెలుగు చిత్ర పరిశ్రమలో కంటెంట్ ఉన్న అతి కొద్దిమంది దర్శకులలో ఒకరు. ఏ తరహా కథాంశాన్నైనా ఆకట్టుకునేలా రూపొందించగల ఈ దర్శకుడికి… సంగీతపరంగానూ మంచి పరిజ్ఞానం ఉంది. అందుకే కృష్ణవంశీ తెరకెక్కించిన పలు సినిమాలు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా ప్రేక్షకులను అలరించాయి. అటువంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌లలో ‘అంతఃపురం’(1998) ఒకటి. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరసారథ్యంలో రూపొందిన ఆ చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో విశేషాదరణ పొందాయి. కట్ చేస్తే... రెండు దశాబ్దాల తరువాత ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మరో సినిమా కోసం జట్టుకట్టింది.
స్పెషల్ డేన రానున్న ‘అఖిల్ 4’?
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి గోపిసుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు. 'గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్' పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
కారు ప్రమాదం గురించి రాజశేఖర్ వివరణ
హీరో రాజశేఖర్ కారు ఔటర్ రింగ్ రోడ్డు లో 12వ తేదీ రాత్రి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాను క్షేమంగా ఉన్నానని , తనకు ఎటువంటి గాయాలు కాలేదని, కారు ప్రమాదం గురించి రాజశేఖర్ వివరించారు .
ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన చెర్రీ
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఇక ఈ సినిమా నుండి ఎప్పుడు అప్ డేట్ వస్తుందా అని అటు ఎన్టీఆర్ అభిమానులు..ఇటు చెర్రీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు చెర్రీ. మొన్నటివరకూ విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా... ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుంటుంది. ఇక ఈ షూటింగ్ పై చెర్రీ ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. షూటింగ్ కు కారులో వెళ్తూ.. రామోజీ ఫిలిం సిటీ లో ఉదయం షూటింగ్లకు రావడం ఎంతో బావుంటుంది.. మార్నింగ్ షూట్ ను నేను బాగా ఎంజాయ్ చేస్తాను అని…
కళ్యాణ్ రామ్ కొత్త సినిమా - 500 ఏళ్లకి ముందు-ఆ తరువాత..!
'118' లాంటి డిఫరెంట్ కథతో మంచి హిట్ కొట్టాడు నందమూరి కల్యాణ్‌రామ్. ప్రస్తుతం సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నటిస్తున్న కల్యాణ్‌రామ్ సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చింది. కేరళలోని మున్నార్ తదితర సుందరమైన ప్రదేశాల్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాను జనవరి 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
'సరిలేరు నీకెవ్వరు' నుండి రాబోతున్న ఫస్ట్ సింగిల్..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళాలో జరుపుకుంటుంది. ఒక సాంగ్ ను, కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తారట చిత్రయూనిట్.

#RT66 ప్రారంభానికి ముహూర్తం ఖరారు
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సినిమాను తెరకెక్కిస్తున్నారు.

తేజ డేరింగ్ డెసిషన్ - ఆర్టికల్ 370పై సినిమా..!
మొదటి నుండి కాస్త డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటాడు డైరక్టర్ తేజ. తాను డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా 'చిత్రం' ఆ తర్వాత వరుసగా 'నువ్వు నేను', 'జయం' ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఒక్క 'నువ్వు నేను' సినిమాకే ఆరు నంది అవార్డులు వచ్చాయంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన 'సీత' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి.
హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లో నటించాలనుంది - ఇలియానా
దేవదాస్ వంటి సూపర్ హిట్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన ఇలియానా నటించిన పోకిరి, జల్సా, కిక్ , జులాయి మూవీస్ ఘనవిజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ మూవీ బర్ఫీ తో ఇలియానా బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. ఇలియానా నటించిన పలు బాలీవుడ్ మూవీస్ ఘనవిజయం సాధించినా , ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనే వంటి స్టార్ హీరోయిన్స్ స్థాయి కి ఇలియానా చేరుకోలేదు. అయినా ఆమె ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో విజయం సాధించిన రకుల్ ప్రీత్ సింగ్ 2014 సంవత్సరం లో సూపర్ హిట్ యారియాన్ మూవీ తో బాలీవుడ్ లో అడుగులోపెట్టారు. తరువాత టాలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 5 సంవత్సరాల గ్యాప్ తరువాత రకుల్ నటించిన దే దే ప్యార్ దే హిందీ మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు రకుల్ నటించిన మరో మూవీ మర్జావాన్ నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది.
మహేష్ బాబు ట్వీట్ కు కమల్ హాసన్ రీ ట్వీట్
లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ నవంబర్ 7వ తేదీ తో 65 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. కలత్తూర్ కన్నమ్మ తమిళ మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కోలీవుడ్ లో ప్రవేశించిన కమల్ హాసన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో 60 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకొన్నారు. కమల్ హాసన్ నటించిన అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. కమల్ హాసన్ నటుడే కాకుండా నిర్మాత, దర్శకుడు, సింగర్ కూడా. 60 సంవత్సరాల సినీ కెరీర్ కంప్లీట్ అయినా సందర్భంగా అభినందనలు తెలుపుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

'కార్తికేయ 2' కోసం భారీ బడ్జెట్
చందూ మొండేటి దర్శకత్వంలో, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014 వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. కార్తికేయ తో తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు ఇప్పటికే కన్ఫామ్ ఐన సంగతి కూడా విదితమే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా వుంది.
బిజీ షెడ్యూల్ లో రానా దగ్గుబాటి
కొన్ని నెలల బ్రేక్ తరువాత రానా దగ్గుబాటి హైదరాబాద్ చేరుకున్నారు. హెదరాబాద్ రాగానే బిజీగా మారారు. అశోక్ గల్లా ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. తరువాత తన అప్ కమింగ్ మూవీస్ షూటింగ్ షెడ్యూల్స్ కై దర్శకులతో మీటింగ్ లో పాల్గొన్నారు. మైథలాజికల్ మూవీ హిరణ్య కశిప మూవీ ప్రీ ప్రొడక్షన్ ను పర్యవేక్షిస్తున్నారు.

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో అల్లరి నరేష్..!
అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ కు గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దానితో కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. మహర్షి సినిమాలో మహేష్ బాబు కు ఫ్రెండ్ గా చేయగా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.

"విజయ్ సేతుపతి" పవన్ కళ్యాణ్ కై రాసిన కథ - విజయ్ చందర్
హీరో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, నివేత పేతురాజ్ ప్రధాన పాత్రలలో విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ సంగ తమిళన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజయ్ సేతుపతి మూవీస్ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి. తెలుగు వెర్షన్ ను హర్షిత మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ లో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేశారు.
బాలీవుడ్ డెబ్యూ - నాలుగు భాషల్లో..!
తెలుగు,తమిళ్, హిందీ ఇలా పలుభాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది కీర్తి సురేష్. బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ‘మైదాన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీం పాత్రలో నటిస్తున్నాడు.
భక్తిరస చిత్రంలో నయనతార
కోలీవుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో పాటు, కమర్షియల్ చిత్రాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక భక్తి చిత్రానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కమెడియన్ గా కోలీవుడ్ లో ప్రవేశించిన RJ బాలాజీ దర్శకుడిగా మారారు. నయనతార నటించిన నానుమ్ రౌడీ దాన్, వేట్టైకారన్ మూవీస్ లో బాలాజీ నటించారు.