`ఖైదీ` ఘనవిజయం తమిళ కథానాయకుడు కార్తిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజున విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో… మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు కార్తి. ఈ నేపథ్యంలో… తక్కువ గ్యాప్‌లోనే కొత్త చిత్రంతో పలకరించబోతున్నాడీ టాలెంటెడ్ స్టార్. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`దృశ్యం` మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళంలో `తంబి` టైటిల్ తోనూ… తెలుగులో `తమ్ముడు` పేరుతోనూ రాబోతుందని టాక్. మరి… మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ `ఖైదీ`తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తి… చిరు తమ్ముడు, మెగాపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ `తమ్ముడు`తోనూ అదే ఫీట్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.
అక్కాతమ్ముళ్ళ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న `తమ్ముడు`లో కార్తికి అక్కగా జ్యోతిక నటించింది. నిజజీవితంలో వదిన, మరిది అయిన జ్యోతిక, కార్తి తొలిసారిగా కలసి నటిస్తున్న సినిమా కావడం… అందులోనూ అక్కాతమ్ముళ్ళ పాత్రల్లో కనిపించనుండడం ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























