రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సైకో’

Psycho Movie Final Release Date,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Psycho Movie Release Date Fixed,Psycho Movie Latest News,Psycho Movie Updates,Psycho Movie Release Date Finalised

‘తుప్పరివాలన్’(తెలుగులో ‘డిటెక్టివ్’) వంటి స‌క్సెస్ ఫుల్‌ యాక్షన్ థ్రిల్లర్ తరువాత దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన‌ తమిళ చిత్రం ‘సైకో’. ఇందులో నిత్యా మీనన్, అదితీరావు హైదరి, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ అంధుడి పాత్రలో కనిపించనుండగా… అదితిరావు హైదరి రేడియో జాకీగా దర్శనమివ్వనుంది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ మోళి మాణిక్యం నిర్మించిన‌ ఈ సినిమాని… క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. కాగా… ఇటీవల విడుదల చేసిన `సైకో` టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. మరి… రెండేళ్ళ క్రితం ‘తుప్పరివాలన్’ తో మంచి విజయాన్ని అందుకున్న మిస్కిన్… ఇప్పుడు ‘సైకో’తో కూడా అదే బాట పడతాడేమో చూడాలి.

ఇదిలా ఉంటే… తెలుగులోనూ `సైకో` అదే రోజున విడుద‌ల కానుంద‌ని స‌మాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 17 =