దేశ వ్యాప్తంగా అభిమానులున్న నటుడు, నిర్మాత, దర్శకుడు ఉపేంద్ర ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వంలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా అండర్ వరల్డ్ నేపథ్యం లో రూపొందనున్న మాస్ ఎంటర్ టైనర్ కబ్జ మూవీ షూటింగ్ నవంబర్ 18 వ తేదీ ప్రారంభం కానుంది. బెంగుళూరు, ముంబై, మధురై , మంగుళూరు లలో ఈ మూవీ
చిత్రీకరణ జరుపుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న కబ్జ మూవీ లో మెయిన్ విలన్ గా జగపతి బాబు నటిస్తున్నారు. ఉపేంద్ర, జగపతి బాబు ఫస్ట్ కాంబినేషన్ లో ఈ మూవీ రూపొందనుంది. నానా పటేకర్ , మనోజ్ బాజ్ పాయ్, ప్రకాష్ రాజ్ , జయప్రకాశ్ రెడ్డి, ప్రదీప్ రావత్, సముద్ర ఖని ప్రతినాయకులుగా నటిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలలో రిలీజ్ కానుంది. సొంత బ్యానర్ లో కబ్జ మూవీ ని ఆర్. చంద్రు తెరకెక్కిస్తున్నారు. ఆర్. చంద్రు, ఉపేంద్ర కాంబినేషన్ లో మూడవ మూవీ కబ్జ.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































