కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

'ఆకాశం నీ హద్దురా' అంటున్న సూర్య

ఫస్ట్ లుక్1 ని. చదువు

'ఆకాశం నీ హద్దురా' అంటున్న సూర్య

Suriya New Movie First Look Out Now

సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే 'కాప్పాన్' తెలుగులో 'బందోబస్త్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ (అసాధారణ కలలు కన్న సాధారణ వ్యక్తి కథ)టైటిల్‌తో విడుదల కానుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. నల్లటి బనియన్ ధరించిన గాల్లోకి ఆనందంగా ఎగురుతున్న సూర్య లుక్ ఆకట్టుకుంటుంది.

కాగా కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్య నిర్మిస్తున్నారు. మారా అనే పైలెట్‌ పాత్రలో సూర్య కనిపించనున్నారని తెలుస్తోంది. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవీప్రకాశ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి నికేత్‌ బొమ్మి. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్