‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తమిళ్ రీమేక్ లో కమెడియన్..!

Agent Sai Srinivasa Athreya Movie Remake in Tamil, Agent Sai Srinivasa Athreya Remade In Tamil?, Agent Sai Srinivasa Athreya Telugu Movie, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

అదృష్టం ఉండాలే కానీ చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు కొడతాయి. ఇప్పటికే ఇది పలు సినిమాల్లో రుజువైంది కూడా. అలా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాతో క్యారెక్టర్ నటుడు నవీన్‌ పొలిశెట్టి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అశ్వనీదత్‌ కుమార్తె స్వప్న నిర్మించనున్న సినిమాలో నవీన్‌ నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నిర్మాతలు కూడా నవీన్‌ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హిందీలో కూడా ‘చిచోరే’ సినిమాలో నటించగా అది కూడా సూపర్ హిట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాను కూడా తమిళ్ లో రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ రీమేక్ లో ప్రముఖ కమెడియన్ సంతానం నవీన్ చేసిన పాత్రను చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది. మరి తెలుగులో హిట్ అయిన ఈ సినిమా తమిళ్ లో ఎంత వరకు హిట్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =