ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 21
‘డిస్కోరాజా’... మాస్ మహారాజా బర్త్‌డే స్పెషల్
కళ్యాణ్ రామ్‌తో మరోసారి కె.వి.గుహన్ ?
మైత్రీ మూవీ మేకర్స్‌తో వెంకీ కుడుముల?
సూపర్ గా 'యాక్షన్' ప్రీ రిలీజ్ బిజినెస్
యంగ్ హీరో కోసం అద్దెకు భారీ స్టేడియం
'అల వైకుంఠపురములో' నుండి 'ఓ మై గాడ్ డాడీ'

న్యూ ఇయర్ కు ఆర్ఆర్ఆర్ ట్రీట్..?
నెగెటివ్ రోల్ లో నటించాలని ఉంది -హన్సిక
తిరుపతి పరిసర ప్రాంతాలలో శ్రీకారం మూవీ షూటింగ్

మారిన 'అనుకోని అతిధి' రిలీజ్ డేట్

100 కోట్ల క్లబ్ లో ఖైదీ మూవీ

"యాక్షన్ " మూవీ లో కమాండో పాత్ర
మంచు మనోజ్ బ్యానర్ లో ఇస్మార్ట్ భామ..!
మారిన రిలీజ్ డేట్స్ ?

2020 సంక్రాంతికి మెహరీన్ డబుల్ ధమాకా
`మర్జావాన్`కి రకుల్ ప్రీత్ సెంటిమెంట్
చిత్రసీమలో ఒక్కొక్కరికి ఒక్కో అదృష్టమాసం ఉంటుంది. అలా... స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కి కూడా ఓ లక్కీ మంత్ ఉంది. ఆ నెలే... నవంబర్. రకుల్ కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన తెలుగు సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(2013 నవంబర్ 29)... ఆరేళ్ళ క్రితం ఇదే నవంబర్‌లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే తమిళనాట రకుల్‌కి మెమొరబుల్ ఫిల్మ్ గా నిలచిన ‘థీరన్ అధిగారం ఒండ్రు’ (తెలుగులో ‘ఖాకి’) (2017 నవంబర్ 17) కూడా రెండేళ్ళ క్రితం ఇదే నవంబర్‌లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది.
‘డిస్కోరాజా’... మాస్ మహారాజా బర్త్‌డే స్పెషల్
ఇప్పటివరకు మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ఏ సినిమా కూడా తన బర్త్‌డే స్పెషల్ గా రిలీజ్ కాలేదు. అయితే, తొలిసారి ఆ క్రెడిట్‌తో అభిమానుల ముందుకు రానుంది ‘డిస్కోరాజా’.
కళ్యాణ్ రామ్‌తో మరోసారి కె.వి.గుహన్ ?
యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ కె.వి.గుహన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘118’. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కాగా... కళ్యాణ్, గుహన్ కలయికలో మరో సినిమా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్‌తో వెంకీ కుడుముల?
`ఛలో`(2018) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు వెంకీ కుడుముల. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ని అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్... ప్రస్తుతం యువ కథానాయకుడు నితిన్‌తో `భీష్మ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోపే... తన మూడో చిత్రాన్ని పట్టాలెక్కించే దిశగా ప్రణాళిక రచిస్తున్నాడట వెంకీ.

#RT 66 మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై బి. మధు నిర్మాణ సారథ్యం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న #RT66 మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్స్ కాగా , నటుడు, దర్శకుడు సముద్ర ఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ కి థమన్ Sసంగీతం అందిస్తున్నారు.
సూపర్ గా 'యాక్షన్' ప్రీ రిలీజ్ బిజినెస్
కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియర్ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది. ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలే వున్నాయి.
యంగ్ హీరో కోసం అద్దెకు భారీ స్టేడియం
డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా 'A1 ఎక్స్ ప్రెస్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తమిళ్ లో వచ్చిన ఓ సినిమా రీమేక్ అని తెలుస్తుంది.
'అల వైకుంఠపురములో' నుండి 'ఓ మై గాడ్ డాడీ'
'అల వైకుంఠపురములో' నుండి వచ్చిన 'సామజవరగమన'.. 'రాములో రాములా' పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట వచ్చిన 'సామజవరగమన' పాట సూపర్ హిట్ అయింది 100 మిలియన్ వ్యూస్ ను దాటి ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా పాటకు రానన్ని వ్యూస్ తో యూ ట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్, వ్యూస్ రావడం ఇదే ప్రధమం. ఇక ఈ పాట తర్వాత వచ్చిన 'రాములో రాములా' పాట కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. విడుదలైన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ (8.3 మిలియన్ వ్యూస్) పొందిన దక్షిణాది పాటగా మరో రికార్డుని సొంతం చేసుకుంది.
ఒక్క సాంగ్ మినహా ప్రతి రోజూ పండగే షూటింగ్ పూర్తి
గీతా ఆర్ట్స్ , UV క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దాసరి దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ ఒక కీలక పాత్ర లో నటించారు. గ్రామీణ నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో అనుబంధాలకు పెద్ద పీట వేశారు. థమన్ S సంగీతం అందించారు.

న్యూ ఇయర్ కు ఆర్ఆర్ఆర్ ట్రీట్..?
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
నెగెటివ్ రోల్ లో నటించాలని ఉంది -హన్సిక
కోలీవుడ్ లో బిజీగా ఉన్న హన్సిక అప్పుడప్పుడూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో హన్సిక హీరోయిన్ గా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ తెనాలి రామకృష్ణ BABL మూవీ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఆమూవీ ప్రమోషన్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో హన్సిక పాల్గొన్నారు.
తిరుపతి పరిసర ప్రాంతాలలో శ్రీకారం మూవీ షూటింగ్
రన్ రాజా రన్ , మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, శతమానం భవతి, మహానుభావుడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో అలరించిన యంగ్ హీరో శర్వానంద్ మరో రెండు మూవీస్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సూపర్ హిట్ తమిళ మూవీ 96 తెలుగు రీమేక్ శర్వానంద్, సమంత జంటగా రూపొంది విడుదలకు సిద్ధంగా ఉంది.

మారిన 'అనుకోని అతిధి' రిలీజ్ డేట్
వివేక్ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’ మూవీ ఎంత విజయం సాధించిందో తెలిసిందే కదా. ఇక ఫిదా సినిమాతో సాయి పల్లవికి తెలుగులో కూడా మంచి క్రేజ్ రావడంతో 'అథిరన్' సినిమాను కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు మేకర్స్. ఇన్ ట్రూప్ ఫిలిమ్స్ సమర్పణలో జయంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్ తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
మహర్షి ఖాతాలో మరో రికార్డ్ - అత్యంత ప్రభావితం చేసిన సినిమా
కేవలం కమెర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఓ సోషల్ మెసేజ్ కూడా అందులో జోడించి ఆడియన్స్ సైతం ఆలోచింప చేసే విధంగా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు తో ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు. అంతకు ముందే ఊరిని దత్తత తీసుకోవాలన్న కాన్సెప్ట్ వున్నా కానీ.. శ్రీమంతుడు సినిమాతో అది మరింత వెలుగులోకి వచ్చినది చెప్పొచ్చు.

100 కోట్ల క్లబ్ లో ఖైదీ మూవీ
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ అక్టోబర్ 25 వ తేదీ రిలీజయ్యి రెండు భాషలలోనూ ఘనవిజయం సాధించింది. తమిళ హీరోలు రజనీకాంత్, అజిత్, విజయ్ సినిమాలు 100కోట్ల క్లబ్ లో చేరతాయి. ఇప్పుడు కార్తీ హీరోగా నటించిన ఖైదీ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరింది. కార్తీ సినీ కెరీర్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు ఉన్నా ఏ మూవీ 100కోట్ల క్లబ్ లో చేరలేదు. ఆ ఘనత ఖైదీ మూవీ కి దక్కింది.

"యాక్షన్ " మూవీ లో కమాండో పాత్ర
తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా సైరా నరసింహారెడ్డి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. హీరో విశాల్ , తమన్నా జంటగా సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ తమిళ మూవీ "యాక్షన్ ", తెలుగు డబ్బింగ్ వెర్షన్ "యాక్షన్" మూవీ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి.

చిరు, కొరటాల మూవీ - లక్కీ హీరోయిన్ పై త్వరలో ప్రకటన
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
మంచు మనోజ్ బ్యానర్ లో ఇస్మార్ట్ భామ..!
మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్ కు తన సినీ కెరీర్ చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి కూడా లేదని చెప్పొచ్చు. కొంతకాలంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడంతో ఇటీవలే మంచు మనోజ్ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. దాంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇకపోతే విడాకుల అనంతరం తాను మాళ్ళీ తనకు ఇష్టమైన ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. అయితే ఈ సారి హీరోగా కాకుండా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
మారిన రిలీజ్ డేట్స్ ?
సంక్రాంతి పండుగ కు రిలీజ్ అయిన సినిమాలు కలెక్షన్స్ కొల్లగొడతాయి. సినిమాలు చూసి ప్రజలు సంక్రాంతి పండుగ సెలవులు ఎంజాయ్ చేస్తారు. అందుకే నిర్మాతలు తమ మూవీస్ ను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. 2020 సంవత్సరం సంక్రాంతికి రెండు భారీ తెలుగు చిత్రాలు, డబ్బింగ్ మూవీ విడుదలకు సిద్ధం అయ్యాయి.

2020 సంక్రాంతికి మెహరీన్ డబుల్ ధమాకా
“హనీ ఈజ్ ద బెస్ట్” అంటూ 2019 సంక్రాంతికి ‘ఎఫ్ 2’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పంజాబీ జాబిలి మెహరీన్... 2020 సంక్రాంతికి ఏకంగా రెండు సినిమాలతో డబుల్ ధమాకా ఇవ్వనుంది. అందులో ఒకటి తెలుగు చిత్రం కాగా... మరొకటి తమిళ సినిమా కావడం విశేషం.