యంగ్ హీరో కోసం అద్దెకు భారీ స్టేడియం

Interesting Update About Sundeep Kishan New Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Sundeep Kishan New Movie Updates,Actor Sundeep Kishan Next Movie News,Sundeep Kishan Latest News 2019

డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ‘A1 ఎక్స్ ప్రెస్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తమిళ్ లో వచ్చిన ఓ సినిమా రీమేక్ అని తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా హాకీ నేపథ్యంలో సాగే సినిమా. ఇందులో సందీప్ హాకీ ప్లేయర్ గా నటిస్తున్నాడు. ఈ షూటింగ్ కోసం హైదరాబాద్ లోని ఒక పెద్ద స్టేడియం అద్దెకి తీసుకున్నారట. 22 మంది హాకీ ప్లేయర్ల తో సాగే గేమ్ కాబట్టి భారీ స్టేడియం నే బుక్ చేశారట. హాకీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నింటినీ ఇక్కడే చిత్రీకరించనున్నారని సమాచారం. ఆ తరువాతనే ఇతర సన్నివేశాల కోసం వేరే లొకేషన్స్ కి వెళతారట. ఇదిలా ఉండగా ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తుంది. తను కూడా ఇందులో లేడీ హాకీ ప్లేయర్ గా కనిపించనుంది. అలాగే ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా సందీప్ కిషన్ చేసిన ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 13 =