సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ నాయికగా సీనియర్ హీరోయిన్ త్రిషను ఎంపికచేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నయనతార, కాజల్, శృతి హాసన్, లాంటి పేర్లు కూడా వచ్చాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ రూమర్లకు కాగా ఈ పుకార్లకు త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నాడట కొరటాల. ఈ మూవీ పూర్తి క్యాస్ట్ అండ్ క్రూ ని త్వరలోనే ప్రకటించనున్నారట. హీరోయిన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ మిగతా నటీనటులు, ఇలా మొత్తం క్రూ ని ప్రకటించనున్నారని సమాచారం. మరి చూద్దాం చిరు 152 లో నటించే లక్కీ ఛాన్స్ ఏ లక్కీ హీరోయిన్ కొట్టేస్తుందో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: