యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ కె.వి.గుహన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘118’. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్… బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కాగా… కళ్యాణ్, గుహన్ కలయికలో మరో సినిమా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘118’ మంచి విజయం సాధించడంతో ఆ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే దిశగా ప్లాన్ చేస్తున్నాడట గుహన్. ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ రామ్‌తో చర్చలు కూడా జరిపాడని టాక్. అంతేకాదు, ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను… 2020లో సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలోనూ ఉన్నట్టు అంతర్గత వర్గాల సమాచారం. త్వరలోనే ఈ సీక్వెల్‌కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే… కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’ సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: