మంచు మనోజ్ బ్యానర్ లో ఇస్మార్ట్ భామ..!

ismart heroine roped in Manchu Manojs production,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Manchu Manoj production Movies,ismart Heroine Upcoming Movies,Manchu Manoj Latest News 2019

మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్ కు తన సినీ కెరీర్ చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి కూడా లేదని చెప్పొచ్చు. కొంతకాలంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడంతో ఇటీవలే మంచు మనోజ్ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. దాంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇకపోతే విడాకుల అనంతరం తాను మాళ్ళీ తనకు ఇష్టమైన ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. అయితే ఈ సారి హీరోగా కాకుండా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీపావళి సందర్భంగా మంచు మనోజ్ కూడా తన కొత్త జర్నీకి శ్రీకారం చుట్టాడు. ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి… నా సొంత నిర్మాణ సంస్థ ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’నిర్మాణంలోనే నా తదుపరి చిత్రాలు వస్తాయి… అదేవిధంగా కొత్త టాలెంట్‌ కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. భవిష్యత్‌ లో మా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే మంచి చిత్రాలను మీరు చూస్తారని తెలిపాడు.

ఇక ఇప్పుడు తాజాగా తన బ్యానర్ లో వస్తున్న సినిమాపై మరో ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. తను నిర్మిస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. త్వరలోనే ఈ సినిమాను ప్రారంభినచనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో హీరో, డైరెక్టర్ ఎవరో.. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − thirteen =