2020 సంక్రాంతికి మెహరీన్ డ‌బుల్ ధ‌మాకా

F2 Actress Mehreen Queue Movies in 2020,Mehreen Movie Releases For Sankranthi 2020,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Mehreen New Movie Releases in 2020,Mehreen Movies 2020

“హనీ ఈజ్ ద బెస్ట్” అంటూ 2019 సంక్రాంతికి ‘ఎఫ్ 2’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పంజాబీ జాబిలి మెహరీన్… 2020 సంక్రాంతికి ఏకంగా రెండు సినిమాల‌తో డబుల్ ధమాకా ఇవ్వనుంది. అందులో ఒకటి తెలుగు చిత్రం కాగా… మరొకటి తమిళ సినిమా కావ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే, ప్ర‌స్తుతం మెహ‌రీన్‌… నందమూరి క‌ళ్యాణ్ రామ్‌కి జోడీగా ‘ఎంత మంచివాడవురా’ అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని… 2020 సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే… కోలీవుడ్ స్టార్ ధనుష్ కి జంట‌గా మెహ‌రీన్ నటిస్తున్న త‌మిళ‌ చిత్రం ‘పట్టాస్’ కూడా పొంగ‌ల్ సీజ‌న్ లోనే రిలీజ్ కానుంది. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ధనుష్ తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. మరి… 2019 సంక్రాంతికి ‘ఎఫ్ 2’ రూపంలో ఘనవిజయం అందుకున్న‌ మెహ‌రీన్‌… 2020 సంక్రాంతికి రానున్న‌ ఈ రెండు చిత్రాలతోనూ అదే ఫీట్‌ని రిపీట్ చేస్తుందేమో చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eight =