మహర్షి ఖాతాలో మరో రికార్డ్ – అత్యంత ప్ర‌భావితం చేసిన సినిమా

Maharshi Movie Creates New Record,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Maharshi Movie New Record,Maharshi Telugu Movie Record,Mahesh Babu Maharshi Movie

కేవలం కమెర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఓ సోషల్ మెసేజ్ కూడా అందులో జోడించి ఆడియన్స్ సైతం ఆలోచింప చేసే విధంగా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు తో ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు. అంతకు ముందే ఊరిని దత్తత తీసుకోవాలన్న కాన్సెప్ట్ వున్నా కానీ.. శ్రీమంతుడు సినిమాతో అది మరింత వెలుగులోకి వచ్చినది చెప్పొచ్చు.

ఇక ఇటీవల వచ్చిన మహర్షి సినిమాలో కూడా పలు విషయాలు తెలిపాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు ప్రధానపాత్రలో తెరక్కేక్కిన ఈ సినిమాలో స్నేహం, లక్ష్యం, రైతుల సమస్యల గురించి వివరంగా చెప్పారు. విజయమే లక్ష్యంగా సాగాలని తపించే యువకుడిగా ప్రథమార్థంలో… ద్వితీయార్థంలో రైతు సమస్యలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. రైతుల కష్టాలు.. వారి ఎదుర్కొనే సమస్యలు చాలా చక్కగా చూపించారు. అంతే కాదు.. వీకెండ్ ఫామింగ్ అనే మరో కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. యూత్ కూడా ఈ కాన్సెప్ట్ కు బాగానే కనెక్ట్ అయింది.

ఇక ఇప్పటీకే పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన మహర్షి ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం 2019 సంవ‌త్సరానికి గాను ట్విట్ట‌ర్‌లో అత్యంత ప్ర‌భావితం చేసే అంశాల‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ‘మోస్ట్ ఇన్‌ఫ్లుయన్షల్ మూమెంట్స్ ఆన్ ట్విట్టర్’లో విశ్వాసం మొదటిస్థానంలో ఉండగా.. లోకసభ ఎలక్షన్స్ 2019 మరియు సీడబ్ల్యూసీ 19 వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఆ తరువాత మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. తదుపరి ఐదో స్థానంలో హిందువుల పండగ దీపావళి చోటు దక్కించుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కి కృత‌జ్ఞ‌తలు తెలుపుతూ ట్విట్టర్లో ట్వీట్ చేసారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here