న్యూ ఇయర్ కు ఆర్ఆర్ఆర్ ట్రీట్..?

RRR Movie Treat For New Year,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rajamouli to start New Year with RRR treat,RRR Movie Updates,RRR Movie Latest News,Director SS Rajamouli RRR

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. తాజాగా ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ప్రారంభం అయిన దగ్గరనుండి రోజుకో వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్వాతంత్య్ర దినోత్సవం ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత దసరా అన్నారు.. అది పోయింది.. ఆ తర్వాత దీపావళి అన్నారు.. అది కూడా వెళ్ళిపోయింది.. కానీ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్.

ఇప్పుడు తాజాగా న్యూ ఇయర్ తెర పైకి వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను పోస్టర్స్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న విడుదలకానుంది..

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 12 =