కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 20

సినిమా వార్తలు

కృష్ణ ‘బుర్రిపాలెం బుల్లోడు’కు 40 ఏళ్ళు

సూపర్ స్టార్ కృష్ణకి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఒక‌రు. అలాంటి ఈ ఇద్ద‌రు జంట‌గా న‌టించిన‌ తొలి చిత్రం ‘బుర్రిపాలెం బుల్లోడు’. బీరం మస్తాన్ రావు (ద‌ర్శ‌కుడిగా మొద‌టి సినిమా) రూపొందించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, నాగభూషణం, అల్లు రామలింగయ్య, కాంతారావు, గిరిబాబు, పి.ఎల్.నారాయణ, పండరీబాయి, ఛాయాదేవి, పుష్పకుమారి, రమోల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తిరుపతి ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.విద్యాసాగర్ నిర్మించిన ఈ సినిమాకి స‌త్యానంద్ - జంధ్యాల‌ క‌థ‌ను అందించారు.

Team TFNవాట్సాప్
Khaidi Enters into Successful 4th Week,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Karthi Khaidi Successful Movie,Karthi Khaidi Movie Successful Running,Khaidi Movie Collections
సినిమా వార్తలు

బ్లాక్ బస్టర్ సక్సెస్ - నాలుగో వారంలోకి 'ఖైదీ'

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంప ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా... దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. తొలి షో నుంచి సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించిం తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

`ప్రతి రోజూ పండ‌గే`లో మారుతి తనయ

`సుప్రీమ్` జోడి సాయితేజ్, రాశీఖ‌న్నా మ‌రోసారి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ప్రతి రోజూ పండ‌గే`. కుటుంబ బంధాలు, మాన‌వ విలువ‌ల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు మారుతి తెరకెక్కిస్తున్న‌ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో స‌త్య‌రాజ్, రావుర‌మేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నాగ చైతన్య?

ప్రస్తుతం తెలుగునాట అగ్ర కథానాయకుల నుంచి యువ క‌థానాయ‌కుల వరకు అంద‌రూ పరభాషా చిత్రాల రీమేక్‌ల వైపు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ వ‌రుస‌లోనే యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా తాజాగా ఓ రీమేక్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడని టాక్.

Team TFNవాట్సాప్
Vishal New Movie Title First Look Poster Out,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vishal New Movie Title,Chakra Movie Updates, Chakra Telugu Movie,Vishal Chakra Movie Latest News, Vishal New Movi
ఫస్ట్ లుక్

విశాల్ మరో యాక్షన్ సినిమా - ఫస్ట్ లుక్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియ‌ర్‌ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన సినిమా ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్‌ శంకర్‌, గద్దలకొండ గణేష్‌, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ’యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ లతోనే భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ నే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఒరేయ్ బుజ్జిగా' లో కుమారి 21 ఎఫ్‌ ఫేమ్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమిళ్ చాలా కష్టంగా వుంది..!

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు.. రాజకీయంలో ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'మిస్ మ్యాచ్' రిలీజ్ డేట్ ఫిక్స్

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థలో తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పొన్నియన్ సెల్వన్' నుండి ఔట్..!

ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే సినిమా తీస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వార్తలైతే వచ్చాయి కానీ ఇంత వరకూ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. తమిళ్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడంతో మణిరత్నం కూడా ఈ సినిమాలో నటించే నటీమణులను కూడా అంతే ప్రముఖులను సెలెక్ట్ చేసాడు. యువ స్టార్స్‌ నుంచి సూపర్‌స్టార్స్‌ వరకు పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో భాగం కాబోతున్నారు. ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12వ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

`ప్ర‌భాస్ 20` కోసం రికార్డు స్థాయిలో రెట్రో సెట్స్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చాన్నాళ్ళ త‌రువాత ఓ ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 1970ల కాలం నాటి వాతావ‌ర‌ణంతో తెర‌కెక్కుతున్న ఈ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ... ఇట‌లీ నేప‌థ్యంలో రూపొందుతోంది. పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `జిల్‌` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇ

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాలాన్ని వెన‌క్కి తీసుకువెళ్ళిన `వెంకీమామ‌`

క‌థానాయ‌కుడిగా త‌న ప్ర‌యాణాన్ని ఎప్పుడైతే మొద‌లుపెట్టారో... అటుఇటుగా అదే స‌మ‌యానికి ప్రేక్ష‌కుల‌ను కూడా తీసుకెళ్ళ‌బోతున్నారు విక్ట‌రీ వెంక‌టేష్. స‌రిగ్గా చెప్పాలంటే... కాలాన్ని వెన‌క్కి తీసుకెళ్ళి మ‌రీ వినోదాలు పంచ‌నున్నారు. అయితే, ఇదంతా `వెంకీమామ‌` చిత్రంలోని పాట‌ కోస‌మే సుమా. `వింటేజ్ వెంకీ`ని గుర్తుచేసేలా డిజైన్ చేసిన ఈ రెట్రో నంబ‌ర్‌... వెంకీ ఫ్యాన్స్‌నే కాదు కామ‌న్ ఆడియ‌న్స్‌ని కూడా మెస్మ‌రైజ్ చేసేలా ఉంటుంద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
2019 Marks Zero Releases For These Heroes,Latest Telugu Movies News,Telugu Film News 2019,Telugu Filmnagar,Tollywood Cinema Updates,2019 Tollywood Zero Heroes,2019 Marks Zero Telugu Heroes,Telugu Actors 2019 Marks Zero
సినిమా వార్తలు

2019 లో 'జీరో రిలీజ్' హీరోలు

ఏ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లోనైనా స‌రే... క‌థానాయ‌కులంద‌రూ వెండితెర‌పై హాజ‌రు ప‌లికితేనే క‌నువిందుగా ఉంటుంది. అయితే, ఇది అరుదుగా చోటుచేసుకుంటూ ఉంటుంది. భారీ బ‌డ్జెట్ చిత్రాల కోసం కాల్షీట్స్ కేటాయించ‌డం... లేదంటే అనుకున్న స‌మ‌యానికి సినిమాలు విడుద‌ల కాక‌పోవ‌డం... అదీ కాదంటే ప‌రాజ‌యాలతో పున‌రాలోచ‌న‌లో ప‌డి సెలెక్టివ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకోవ‌డం... ఇలాంటి కార‌ణాల‌తో ప్ర‌తీ ఏడాదిలోనూ కొంద‌రు `మిస్సింగ్ స్టార్స్‌` ఉంటారు. అలా... 2019లోనూ మిస్సింగ్ స్టార్స్ ఉన్నారు. ఆ తార‌ల గురించి క్లుప్తంగా...

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ లైన‌ప్ సెట్ చేసుకున్న సూర్య‌

పేరుకి త‌మిళ క‌థానాయ‌కుడైనా తెలుగులోనూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌ మార్కెట్‌ని సంపాదించుకున్నాడు సూర్య‌. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. ఈ ఏడాది `ఎన్జీకే`, `బందోబ‌స్త్‌` చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన ఈ టాలెంటెడ్ స్టార్... ప్ర‌స్తుతం `గురు` ఫేమ్ సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో `సూర‌రై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హ‌ద్దురా`)లో న‌టిస్తున్నాడు. ఎయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2020 వేస‌విలో తెర‌పైకి రానుంది.

Team TFNవాట్సాప్
సాంగ్

`ఆర్ ఆర్ ఆర్‌` కోసం య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ సాంగ్‌?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌... ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు కూడా నృత్యాల‌కు పెట్టింది పేరు. అలాంటి ఈ డాన్సింగ్ స్టార్స్ క‌ల‌సి ఓ సినిమాలో న‌టిస్తున్నారంటే... ఎవ‌రైనా స‌రే కాంబినేష‌న్ డాన్స్ నంబ‌ర్‌ని ఎక్స్ పెక్ట్ చేయ‌డం స‌హ‌జం. ఈ సంగ‌తి.. చిత్ర రూప‌క‌ర్త, ద‌ర్శ‌క‌ధీరుడు య‌స్.య‌స్. రాజ‌మౌళికి కూడా తెలియంది కాదు. అందుకే... తార‌క్, చర‌ణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` కోసం ఓ అదిరిపోయే డాన్స్ నంబ‌ర్‌ని ప్లాన్ చేశాడ‌ట జ‌క్క‌న్న‌.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Graces at ANR National Awards Ceremony,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,ANR National Awards Ceremony Chief Guest,ANR National Award announced to Sridevi and Rekha,ANR Na
సినిమా వార్తలు

ANR నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్

సినీరంగానికి సేవలందించిన సినీ ప్రముఖులలో ఒకరికి అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతీ సంవత్సరం అక్కినేని అవార్డ్ అందజేస్తున్నారు. 2016 సంవత్సరంలో నటుడు, నిర్మాత , దర్శకుడు దేవానంద్, 2017 సంవత్సరంలో దర్శకధీర రాజమౌళి ఈ అవార్డ్స్ అందుకున్నారు. 2018నసంవత్సరానికి శ్రీదేవి, 2019 సంవత్సరానికి రేఖ ఎంపికయ్యారని కింగ్ నాగార్జున మీడియా సమావేశంలో వెల్లడించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త దర్శకుడితో హీరో నాని మూవీ ?

డిఫరెంట్ పాత్రలు, విభిన్న కథల చిత్రాలలో నటించే హీరో నాని కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో రూపొందుతున్న" V"మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

జయలలిత బయోపిక్ మూవీలో MGR లుక్

లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. విష్ణు ఇందూరి , శైలేష్ R సింగ్ నిర్మాణసారథ్యం లో AL విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్ జయలలిత పాత్ర లో నటిస్తున్న తలైవి మూవీ 10 వ తేదీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తలైవి మూవీ లో అరవింద్ స్వామి MGR పాత్రలో నటిస్తున్నారు. పలువురు ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ముఖ్య పాత్రలలో నటిస్తారని సమాచారం. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ravi Teja Krack Movie Begins Its Shooting Schedule,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ravi Teja Krack Movie Shooting Updates,Krack Telugu Movie Updates,Krack Movie Latest News
షూటింగ్ అప్‌డేట్

"క్రాక్" మూవీ షూటింగ్ ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "క్రాక్ "షూటింగ్ ఈ రోజు ప్రారంభమయింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ లో శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలు. నటుడు, దర్శకుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ప్ర‌తి రోజూ పండ‌గే`లో రాశీ ఖ‌న్నా పాత్ర అదేనా?

ద‌ర్శ‌కుడు మారుతి సినిమాల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. అదేమిటంటే... క‌థాంశం ఏదైనా, ఆయా చిత్రాల్లో క‌థానాయ‌కుల‌కు ఏదో ఒక బ‌ల‌హీన‌త (లేదా లోపం) క‌నిపిస్తుంటుంది. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` నుంచి `మ‌హానుభావుడు` వ‌ర‌కు ఈ ఫార్ములాని భ‌లేగా అప్ల‌య్ చేశాడు మారుతి. క‌ట్ చేస్తే... త‌న నెక్ట్స్ వెంచ‌ర్ `ప్ర‌తి రోజూ పండ‌గే`లోనూ దీన్ని కొన‌సాగించే ప‌నిలో ఉన్నాడ‌ట మారుతి. అయితే... ఈ సారి హీరో పాత్ర‌కి కాకుండా హీరోయిన్ క్యారెక్ట‌ర్ కోసం ఈ బ‌ల‌హీన‌త‌ని డిజైన్ చేశాడ‌ట‌.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

అల .. వైకుంఠపురములో .. థర్డ్ సింగిల్ టీజర్ రిలీజ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ అల .. వైకుంఠపురములో .. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. టబు, సత్యరాజ్ , సుశాంత్, రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్, మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్S సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Team TFNవాట్సాప్

షేర్