‘డిస్కోరాజా’… మాస్ మహారాజా బర్త్‌డే స్పెషల్

Disco Raja Movie To Release On Ravi Teja Birthday,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Disco Raja Movie Release Date,Disco Raja Telugu Movie Release Date,Ravi Teja Birthday Special

ఇప్పటివరకు మాస్ మహారాజా రవితేజ క‌థానాయ‌కుడిగా నటించిన ఏ సినిమా కూడా త‌న‌ బర్త్‌డే స్పెషల్ గా రిలీజ్ కాలేదు. అయితే, తొలిసారి ఆ క్రెడిట్‌తో అభిమానుల ముందుకు రానుంది ‘డిస్కోరాజా’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో ‘డిస్కో రాజా’ పేరుతో ఓ సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతున్న‌ తెలిసిందే.. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్ర‌ల్లో దర్శనమివ్వనున్నాడు రవితేజ. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ క‌థానాయికలుగా నటిస్తున్న ఈ పిరియాడిక‌ల్ మూవీకి థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు.

కాగా… ఈ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన తెలిసిందే. అంటే… ర‌వితేజ‌ బ‌ర్త్ డే (జనవరి 26)కి రెండు రోజుల ముందు పుట్టిన‌రోజు కానుక‌గా `డిస్కో రాజా` రాబోతోంద‌న్న‌మాట‌. మ‌రి… రవితేజ కెరీర్‌లో ఫ‌స్ట్‌ బర్త్‌డే స్పెష‌ల్ మూవీగా విడుదల కాబోతున్న ‘డిస్కోరాజా’… మాస్ మహారాజాకు మెమ‌రబుల్ రిజ‌ల్ట్‌ని అందిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 12 =