‘అల వైకుంఠపురములో’ నుండి ‘ఓ మై గాడ్ డాడీ’

Ala Vaikunthapurramloo Next Single,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ala Vaikunthapurramloo Songs,Ala Vaikunthapurramloo Movie Songs,Ala Vaikunthapurramloo Telugu Movie Songs

‘అల వైకుంఠపురములో’ నుండి వచ్చిన ‘సామజవరగమన’.. ‘రాములో రాములా’ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట వచ్చిన ‘సామజవరగమన’ పాట సూపర్ హిట్ అయింది 100 మిలియన్ వ్యూస్ ను దాటి ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా పాటకు రానన్ని వ్యూస్ తో యూ ట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్, వ్యూస్ రావడం ఇదే ప్రధమం. ఇక ఈ పాట తర్వాత వచ్చిన ‘రాములో రాములా’ పాట కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. విడుదలైన 24 గంట‌ల్లో అత్య‌ధిక వ్యూస్ (8.3 మిలియ‌న్ వ్యూస్‌) పొందిన ద‌క్షిణాది పాట‌గా మ‌రో రికార్డుని సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ‘ఓ మై గాడ్ డాడీ’ అనే పాట టీజర్ ను రేపు ఉదయం 10:00గంటలకు విడుదల చేయనున్నారు. ఆ విషయాన్నీ అధికారికంగా పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మరి మొదటి సాంగ్ ‘సామజవరగమన’ పాట మెలోడీ కాగా, రెండవ పాట ‘రాములో రాములా’ మంచి బీట్ సాంగ్.. ఈ పాట ఎలా ఉంటుందో.. ఇది ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం..

కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
మరి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =