యమదొంగ మూవీ తమిళ డబ్బింగ్ వెర్షన్ “విజయన్”

Blockbuster Movie Yamadonga Tamil Dubbed Version Titled Vijayan,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Yamadonga Tamil Version Titled Vijayan,Blockbuster Movie Yamadonga,Vijayan Movie Updates

విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ కామెడీ యమదొంగ మూవీ 2007 సంవత్సరం ఆగస్ట్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రియమణి, మమతా మోహన్ దాస్ కథానాయికలు కాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటించారు. కీరవాణి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకుల కు వీనుల విందు చేశాయి. యమదొంగ మూవీ ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు యమదొంగ మూవీని విజయన్ పేరుతో తమిళ భాషలో డబ్బింగ్ చేస్తున్నారు. 12 సంవత్సరాల తరువాత ఈ మూవీ ని తమిళం లో డబ్ చేయడం విశేషం. సుదిక్ష ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై విజయన్ మూవీ రూపొందుతుంది. తెలుగు లో ఘనవిజయం సాధించిన యమగోల , యముడికి మొగుడు తమిళం లో రీమేక్ అయ్యి తమిళ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. విజయన్ మూవీ కూడా తమిళ ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.