కోలీవుడ్ స్టార్ సూర్యకి అచ్చొచ్చిన దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన `కాక్క కాక్క` (`ఘర్షణ`కి మాతృక), `వారణమ్ ఆయిరమ్` (తెలుగులో `సూర్య సన్నాఫ్ కృష్ణన్`) తమిళనాట ఘనవిజయం సాధించాయి. కట్ చేస్తే.. పన్నెండేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రానుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కోసం కూడా ఓ డిఫరెంట్ స్టోరీని డిజైన్ చేసుకున్నారట గౌతమ్. అంతేకాదు… ఇందులో అనుష్కని కథానాయికగా ఎంచుకున్నారని టాక్. అదే గనుక నిజమైతే… ఇప్పటివరకు `యముడు` సిరీస్‌లోనే నటిస్తూ వచ్చిన సూర్య, అనుష్క జంటకి ఇదో రీ-ఫ్రెషింగ్ జానర్ మూవీ అయ్యే అవకాశముంది. త్వరలోనే సూర్య, అనుష్క, గౌతమ్ చిత్రంపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: