తన సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ `అజ్ఞాతవాసి` తరువాత క్రియాశీలక రాజకీయాలతో బిజీ అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కాగా, రెండేళ్ళ విరామం అనంతరం.. వెండితెరపై మరోసారి వెలుగులు పంచేందుకు ఈ టాలెంటెడ్ స్టార్ సన్నద్ధమవుతున్నారని టాక్. అంతేకాదు… హిందీనాట సంచలన విజయం సాధించిన కోర్టు డ్రామా `పింక్`ని రీమేక్ చేస్తూ… తన రీ-ఎంట్రీకి రెడీ అవుతున్నారట. `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారని వినికిడి. అలాగే పవన్ సన్నిహితుడు, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ రీమేక్‌కి సంభాషణలు అందించనున్నారట. ప్రస్తుతం మార్పులు, చేర్పుల కసరత్తులో యూనిట్ ఉందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి `లాయర్ సాబ్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని… 2020 జనవరిలో చిత్రాన్ని ప్రారంభించి 2020 మేలో వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అంతేకాదు… పూజా హెగ్డే ఓ కీలక పాత్రలో కనిపించనున్న ఈ కోర్టు డ్రామా కోసం… డిసెంబర్ మూడో వారం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ స్పెషల్ కోర్ట్ సెట్ వేస్తున్నారని కూడా ప్రచారం సాగుతోంది.
మరి… రీ-ఎంట్రీ ఫిల్మ్‌తో పవన్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: