కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 19

సినిమా వార్తలు

'విరాటపర్వం' కు మారిన కెమెరామెన్..!

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమెకు శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సాయి పల్లవి షూటింగ్ లో పాల్గొంటుండగా.. జనవరి నుండి రానా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

TFN Adminవాట్సాప్
త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తర్వాత సినిమా..!
సినిమా వార్తలు

త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తర్వాత సినిమా..!

టాలీవుడ్ హీరోలు ఒక సినిమా సెట్ పైన ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టేస్తున్నారు. ఇక గతకొద్ది కాలంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా వున్న ఎన్టీఆర్ కూడా తన తర్వాత సినిమా కోసం ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. స్క్రిప్ట్ పనులు త్వరలోనే మొదలుపెట్టనున్నాడట త్రివిక్రమ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మళ్ళీ ఆ హీరోతోనే సాహో డైరెక్టర్ సినిమా..?

తన మొదటి సినిమా 'రన్ రాజా రన్' తోనే మంచి హిట్ కొట్టాడు సుజీత్. ఆ హిట్ తో ఏకంగా ప్రభాస్ తోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రభాస్ బాహుబలి సినిమా అయిపోయేంతవరకూ వెయిట్ చేసి మరీ ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా సాహో సినిమాను తెరకెక్కించాడు. ఇంత చిన్న వయసులోనే ఈ రేంజ్ లో సినిమా తీసిన సుజీత్ పై అందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya Full Happy With Venky Mama Output,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Venkatesh Birthday Special Venky Mama, Venky Mama Movie Latest News, Venky Mama Movie Release Date, Venky M
సినిమా వార్తలు

'వెంకీమామ' ఫైనల్ కాపీ - ఫుల్ హ్యాపీ లో చైతు

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. క్రిస్మన్ అన్నారు... జనవరి సంక్రాంతి అన్నారు.. ఇప్పుడు అవేమి కాకుండా.. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అంటే డిసెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... ఒక‌ట్రెండు రోజుల్లో `వెంకీమామ‌` విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

TFN Adminవాట్సాప్
Rajinikanth Wraps Up Dubbing For Darbar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Darbar Movie Updates,Darbar Telugu Movie Latest News,Darbar Movie Shooting Updates,Darbar Telugu Movie Shooting La
షూటింగ్ అప్‌డేట్

'దర్బార్' డబ్బింగ్ పూర్తి చేసిన తలైవా

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమిళ్ డైరెక్టర్ కు అఖిల్ గ్రీన్ సిగ్నల్..!

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తుండగా... గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'దృశ్యం' ద‌ర్శ‌కుడి డిసెంబ‌ర్ డబుల్ ధమాకా

మలయాళ చిత్రం ‘దృశ్యం’తో జాతీయ స్థాయిలో ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జీతూ జోసెఫ్. ఆ త‌రువాత అదే `దృశ్యం`ని త‌మిళంలో `పాప‌నాశం`గా తీసి అక్క‌డా విజ‌య‌బావుటా ఎగుర‌వేశాడు. `దృశ్యం`కి ముందు, త‌రువాత ప‌లు జ‌న‌రంజ‌క చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌... ఈ డిసెంబ‌ర్ లో డ‌బుల్ ధ‌మాకా ఇచ్చేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ్యాంకాక్, థాయ్‌లాండ్ లో బ‌న్నీ, సుక్కు చిత్రం?

`ఆర్య‌`(2004), `ఆర్య 2`(2009) త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చందనం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ స్మగ్లర్‌గా దర్శనమివ్వడమే కాకుండా... చిత్తూరు యాసతో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడ‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే... ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లోని కీలక సన్నివేశాలన్నీ అటవీ నేపథ్యంలో సాగేవి కావడంతో... ప్ర‌స్తుతం లొకేష‌న్ల అన్వేష‌ణ‌లో ఉంద‌ట చిత్ర‌బృందం. ఈ నేప‌థ్యంలోనే... బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లోని దట్టమైన అడవుల్లో లొకేషన్స్‌ను ఎంపిక చేసే దిశ‌గా సుక్కు ప్లాన్ చేస్తున్నాడ‌ని సమాచారం. అలాగే, ఏడాది…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి ‘ద జెంటిల్‌మేన్’కు పాతికేళ్ళు

తెలుగునాటే కాదు హిందీనాట కూడా త‌న‌దైన ముద్ర‌వేశారు మెగాస్టార్ చిరంజీవి. `ప్ర‌తిబంధ్‌`(1990)తో బాలీవుడ్‌లో తొలి అడుగులు వేసిన చిరు... ఆపై `ఆజ్ కా గూండారాజ్‌`(1992), `ద జెంటిల్ మేన్‌`(1994) చిత్రాల‌తో ప‌ల‌క‌రించారు. త‌న న‌ట‌న‌తో, న‌ర్త‌న‌తో అక్క‌డా చిరస్మ‌ర‌ణీయ ముద్ర వేశారు. ఈ మూడు సినిమాలు కూడా ద‌క్షిణాది చిత్రాల‌కు రీమేక్స్ కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘బాహుబలి’ రి-రిలీజ్ కానుందా?

‘బాహుబలి’... ద‌క్షిణాది సినిమాకి కొత్త దారి చూపించిన తెలుగు చిత్రం. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ పేర్ల‌తో రెండు భాగాలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ విజువ‌ల్ వండ‌ర్... ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతేకాదు... రెండో భాగ‌మైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ అయితే... భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిల‌చింది. అంత‌ర్జాతీయ స్థాయిలో విజయఢంకా మోగించిన ఈ అద్భుత జాన‌ప‌ద చిత్ర‌రాజాన్ని... ఇప్పుడు రి-రిలీజ్ చేసే దిశ‌గా ప్లానింగ్ జ‌రుగుతోంద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డబ్బింగ్ షురూ చేసిన‌ ‘వరల్డ్ ఫేమస్ లవర్’?

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇందులో నాలుగు విభిన్న ఛాయ‌లున్న పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు విజ‌య్‌. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాశీఖన్నా, కేథ‌రిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌కుడు. గోపీసుందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను... క్రియేటివ్‌ కమర్షియల్స్ ప‌తాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సాంగ్

పాట చిత్రీకరణలో ‘సరిలేరు నీకెవ్వరు’

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా దర్శనమివ్వనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ప్రస్తుతం కేర‌ళ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఓ పాటను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ శాండల్ వుడ్ ఎంట్రీ ?

టాలీవుడ్, లో, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు కాజల్ శాండల్ వుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధమయ్యింది. SS ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా కన్నడ, తెలుగు, తమిళ. మలయాళ , హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "కబ్జ"మూవీ ఈ రోజు ప్రారంభం కానుంది. కబ్జ మూవీ పాన్ ఇండియా ఫిల్మ్ గా రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Sri Rama Rajyam Movie Completes 8 Years,Veteran Director Bapu Sri Rama Rajyam Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Sri Rama Rajyam Completes 8 Years,8 Years for Sri Rama Rajyam Movie,Sri R
సినిమా వార్తలు

దిగ్గజ దర్శకుడు బాపు చివ‌రి చిత్రం ‘శ్రీరామరాజ్యం’కు 8 ఏళ్ళు

దిగ్గజ దర్శకుడు బాపు పేరు చెబితే చాలు... ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు సీతారాముల కథలు కళ్ళ ముందు కదలాడతాయి. అలా... ఆయన తెర‌కెక్కించిన సీతారాముల చిత్రాలలో ఓ అపురూప దృశ్యకావ్యంగా నిలచిపోయిన సినిమా ‘శ్రీరామరాజ్యం’. అలనాటి ‘లవకుశ’ను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ చలనచిత్రంలో... శ్రీరామచంద్రునిగా నందమూరి బాలకృష్ణ, సీతమ్మగా నయనతార దర్శనమిచ్చారు. ఇతర ముఖ్య పాత్రల్లో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు(వాల్మీకి), శ్రీకాంత్(లక్ష్మణుడు), సమీర్(భరతుడు), ఎ.వి.ఎస్(నారద మహర్షి), మురళీమోహన్(జనక మహారాజు), విందు ధారాసింగ్(హనుమంతుడు), కె.ఆర్.విజయ(కౌసల్యాదేవి), రోజా(భూదేవి), మాస్టర్ గౌరవ్(లవుడు), మాస్టర్ ధనుష్…

Team TFNవాట్సాప్
Venky Mama Movie Set To Release On Venkatesh Birthday,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Venky Mama Movie Release Date,Venky Mama Telugu Movie Updates,Venky Mama Movie Latest News,Venkatesh Bi
సినిమా వార్తలు

వెంకటేష్ బర్త్‌డే స్పెషల్‌గా ‘వెంకీమామ’?

డిసెంబ‌ర్ 13... విక్ట‌రీ వెంక‌టేష్‌కి ఎంతో ప్ర‌త్యేక‌మైన తేది. ఎందుకంటే... ఆ రోజు వెంకీ పుట్టిన‌రోజు మాత్ర‌మే కాదు పెళ్ళి రోజు కూడా. అలాంటి స్పెష‌ల్ డేన ఇప్ప‌టివ‌ర‌కూ వెంకీ న‌టించిన సినిమాలేవీ విడుద‌ల కాలేదు. అయితే, ఆ ముచ్చ‌ట‌ని తీర్చబోతున్నాడు `వెంకీమామ‌`.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బన్నీ-సుకుమార్ సినిమా - రివెంజ్ ఫార్ములా..!

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో 'అల వైకుంఠపురములో' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో... ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ ను.. పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’, 'రాములో రాములా' పాటలను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సీక్వెల్ 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్'

మరోసారి తన టైటిల్ తోనే దుమారం రేపుతూ.. రెండు వర్గాల పేర్లనే టైటిల్ గా తీసుకొని 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అన్న సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతోనే సినిమాకు సగం క్రేజ్ తీసుకొచ్చేసాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేసి... డైరెక్ట్ గా పలు రాజకీయ నేతలపైనే సెటైర్లు వేసాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి 'పప్పు లాంటి అబ్బాయి' సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసి మరో షాకిచ్చాడు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లోడింగ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'అసురన్' రీమేక్ కోసం శ్రీకాంత్ అడ్డాల..?

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన 'అసురన్' మూవీని తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ పక్కన శ్రేయ శరణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
కార్తీ 'దొంగ' టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

కార్తీ 'దొంగ' టీజర్ రిలీజ్

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో మంచి హిట్ కోసం ఎదురుచూసిన కార్తీ ఎదురుచూపులు ఫలితం దక్కింది. సక్సెస్ ఫుల్ గా మూడు వారలు పూర్తి చేసుకొని.. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.

TFN Adminవాట్సాప్

షేర్