అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.ఇక ఒకపక్క షూటింగ్ ను జరువుకుంటూనే, మరోపక్క ప్రమోషన్స్ పనులను కూడా వేగవంతం చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా సినిమా షూటింగు పార్టు పూర్తికాగానే, మహేశ్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లికి.. ఈ సినిమాకి తుది మెరుగులు దిద్దే బాధ్యతను అప్పగించాడని గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు చిత్రయూనిట్. సరిలేరు నీకెవ్వరూ సినిమా అవుట్ పుట్ చూసి, సూచనలు .. సలహాలు మాత్రమే ఇవ్వమని వంశీ పైడిపల్లిని మహేశ్ బాబు అడిగారు.. అంతేకానీ ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
కాగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: