హీరో శ్రీవిష్ణు కు జోడీ గా కాజల్ అగర్వాల్ ?

Kajal Aggarwal Pair Up With Sree Vishnu For New Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Kajal Aggarwal Next Movie with Sree Vishnu,Sree Vishnu New Movie Updates,Kajal Aggarwal Upcoming Projects

2007 సంవత్సరం లో లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు ,2008 సంవత్సరంలో పళని మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అయిన కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని, స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కాజల్ అగర్వాల్ నటించిన పలు తెలుగు, తమిళ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాలలో కాజల్ నటించారు. 12 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ కు సీనియర్ హీరోల మూవీస్ తో బాటు యువ హీరోల మూవీస్ లో కూడా ఆఫర్స్ రావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరోలు శర్వానంద్ తో రణరంగం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కవచం, సీత మూవీస్ లో నటించిన కాజల్ అగర్వాల్ కు మరో యంగ్ హీరో శ్రీవిష్ణు మూవీ లో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందని సమాచారం. శ్రీవిష్ణు నటించిన అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా మూవీస్ ఘనవిజయం సాధించాయి. నూతన దర్శకుడు ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందనున్న మూవీ ని శ్రీవిష్ణు నిర్మించనున్నారు. స్క్రిప్ట్ నచ్చి కాజల్ ఈ మూవీ కి ఓకే చెప్పినట్టు సమాచారం. కాజల్ ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. శాండల్ వుడ్ లో ఉపేంద్ర హీరోగా రూపొందనున్న కబ్జ మూవీ లో హీరోయిన్ గా కాజల్ కు ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =