చిరంజీవి – కొర‌టాల చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స‌య్యిందా?

Chiranjeevi Koratala Movie Got Tentative Release Date,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Chiranjeevi Koratala Movie Release Date,Director Koratala Siva Latest News

ఇటీవ‌ల `సైరా న‌ర‌సింహారెడ్డి`తో అభిమానుల‌ను అల‌రించిన మెగాస్టార్ చిరంజీవి… త్వ‌ర‌లో త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ … ద‌స‌రా సంద‌ర్భంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. కాగా… ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ని డిసెంబ‌ర్‌లో ప్రారంభించ‌నున్నార‌ని… ఆపై నిర‌వ‌ధికంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 14న విడుద‌ల చేసే దిశ‌గా ప్రణాళిక జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`గోవింద హ‌రి గోవింద‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ యాక్ష‌న్ డ్రామాలో చిరంజీవి దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ ఉద్యోగిగా న‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఓ క‌థానాయిక‌గా త్రిష న‌టించ‌నుండ‌గా… బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌క ద్వ‌యం అజ‌య్‌-అతుల్ బాణీలు అందించ‌నున్నార‌ని టాక్‌. మ‌రి… రీ-ఎంట్రీలో వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న మెగాస్టార్‌… ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొడ‌తారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =