ఇటీవల సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ధనంజయన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగార్జున ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. ‘కపటధారి’ అనే టైటిల్ ను పెట్టారు ఈ సినిమాకు. టైటిల్ మాత్రం కాస్త విభిన్నంగానే వుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఈ సినిమా కాక సంతోష్ కుమార్ సుమంత్ మరో సినిమాను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి నిర్మించనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో సుమంత్ ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్ లో చూపించనున్నారట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























