వచ్చే ఏడాది రెండు సినిమాలు – కుదిరితే వెబ్ సిరీస్ కూడా…!

Allu Sirish About His Upcoming Projects,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Allu Sirish Upcoming Projects,Allu Sirish Next Upcoming Movies,Allu Sirish New Film Updates

‘గౌరవం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శిరీష్ ఇంకా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేదనే చెప్పొచ్చు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలు కాస్త హిట్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఇక ఇటీవలే మలయాళం హిట్ మూవీ ‘ఏబీసీడీ’ ని రీమేక్ చేయగా అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో ఓ మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు అల్లు శిరీష్ ఎప్పటినుండో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తన సినిమాల గురించి తాజాగా తన ట్విట్టర్ ద్వారా అప్ డేట్ ఇచ్చాడు. వచ్చే ఏడాది రెండు సినిమాలతో మీ ముందుకు వస్తున్నానని చెప్పాడు. అంతే కాదు మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా ఇచ్చాడు. ఈ రెండు సినిమాలతో పాటు కుదిరితే వెబ్ సిరీస్ కూడా చేస్తానని..ఓ మంచి కథ దొరికితే వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ గా వున్నానని.. త్వరలోనే నా కొత్త సినిమాలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తానని ట్వీట్లో పేర్కొన్నాడు.

మరి ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో అల్లు శిరీష్ కూడా చేరిపోయాడు. చూద్దాం మరి వచ్చే ఏడాది అయినా అల్లు శిరీష్ కు కలిసొస్తుందేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 8 =