హిందీ ‘జెర్సీ’ కి హీరోయిన్ ఫిక్స్..!

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు… విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే షాహిద్ కపూర్ ట్రైనింగ్ కూడా మొదలుపెట్టేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సూపర్ 30, బాట్ల హౌస్ సినిమాల్లో నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

ఇక ఈ రీమేక్ ను తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. అంతేకాదు 2020 ఆగష్టు 28వ తేదీన చిత్రం విడుదలకానున్నట్టు కూడా అప్పుడే వార్తలు వస్తున్నాయి. మరి అర్జున్ రెడ్డి రీమేక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన షాహిద్ కపూర్ జెర్సీ తో కూడా కొడతాడేమో చూద్దాం…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 17 =