తమిళనాట కల్ట్ క్లాసిక్ అనిపించుకున్న `అసురన్` చిత్రం… ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా శ్రియ నటిస్తుందని… అలాగే `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా కన్ఫర్మ్ అయ్యాడని ప్రచారం సాగుతోంది. కాగా… ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ని వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తారని… ఆపై చకచకా చిత్రీకరణ జరిపి వేసవి కానుకగా మే నెలలో సినిమాని జనం మందుకు తీసుకొస్తారని టాక్. త్వరలో ఈ రీమేక్‌కి సంబంధించిన పలు వివరాలు అధికారికంగా వెలుగులోకి రానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… వెంకటేష్ తాజా చిత్రం `వెంకీమామ` డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: