
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 14


"తలైవి" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'రొమాంటిక్' గోవా షెడ్యూల్ పూర్తి

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'వి'

విజయ్ మైనపు విగ్రహా ఆవిష్కరణ..!

రామోజీ ఫిల్మ్ సిటీలో 'ఎంత మంచివాడవురా'

రాశీ ఖన్నా మనసులో మాట

లక్కీ డేట్ కే వస్తున్న మహేష్ బాబు!
'RRR' హాలీవుడ్ తారల విశేషాలు

రామోజీ ఫిల్మ్ సిటీ లో యువ హీరోల సందడి

ది వరల్డ్ ఆఫ్ #NC19 రిలీజ్
'ఆదిత్య వర్మ' కూడా కొట్టేశాడుగా..!
'వీరశాస్త్ర అయ్యప్ప కటాక్షం' ట్రైలర్ రిలీజ్
మీరే మాకు స్పూర్తి..!

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' - రిలీజ్ కు భారీ సన్నాహాలు
రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల తర్వాత వస్తున్న మరో వివాదాస్పదమైన సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ తో ఎంతటి సంచలనం సృష్టించిందో కూడా తెలిసిందే. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో చూపించబోతున్న కంటెంట్ ఎలా వుండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
వెంకీ మామ మూవీ లో అల్లుడు (నాగ చైతన్య ) బర్త్ డే గ్లింప్స్
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ వెంకీ మామ మూవీ డిసెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు కాగా ప్రకాష్ రాజ్, రావు రమేష్, సంపత్ రాజ్, పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ సంగీతం అందించారు.

"తలైవి" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, తమిళ ప్రజల ఆరాధ్య దేవత, అమ్మ, తలైవి , గ్రేట్ పొలిటీషియన్ జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. విబ్రి మోషన్ పిక్చర్స్ , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత పాత్రలో రూపొందుతున్న "తలైవి "మూవీ అక్టో బర్ 10వ తేదీ చెన్నై లో ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న "తలైవి" మూవీ 2020 సంవత్సరం జూన్ 26 వ తేదీ రిలీజ్ కానుంది.

'రొమాంటిక్' గోవా షెడ్యూల్ పూర్తి
అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రొమాంటిక్'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక గతకొద్ది కాలంగా ఈ సినిమా గోవా లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. 30 రోజుల పాటు జరిగిన ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, పూరి మార్క్ బీచ్ సాంగ్ ను షూట్ చేశారు. ఈ సందర్భంగా ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ గోవా షెడ్యూల్ పూర్తి అయిందని తెలిపారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'వి'
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న చిత్రం `వి`. తన తొలి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు నాని.

విజయ్ మైనపు విగ్రహా ఆవిష్కరణ..!
దేశవ్యాప్తంగా ఇప్పటీకే ఎంతో మంది ప్రముఖు నటీనటుల వాక్స్ స్టాచ్యూ లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఖాతాలోకి తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా చేరిపోయాడు. తాజాగా విజయ్ మైనపు బొమ్మ ఏర్పాటు చేశారు. కన్యాకుమారిలోని మయపురి వండర్ వ్యాక్స్ మ్యూజియంలో విజయ్ వ్యాక్స్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

రామోజీ ఫిల్మ్ సిటీలో 'ఎంత మంచివాడవురా'
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా నటిస్తున్న చిత్రం `ఎంత మంచివాడవురా`. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది. సుభాష్ గుప్త, శివలెంక కృష్ణప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనాథాశ్రమం నేపథ్యంలో సాగే ఈ దృశ్యాలు... సినిమాలో ముఖ్య సమయంలో వస్తాయని సమాచారం. గోపీ సుందర్ సంగీతమందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాశీ ఖన్నా మనసులో మాట
టాలీవుడ్, కోలీవుడ్ లలో రాశీ ఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఇమైక్క నోడిగళ్, అడంగ మారు , అయోగ్య వంటి తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సంగ తమిళన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. రాశీ ఖన్నా తెలుగు లో నటించిన ప్రతి రోజూ పండగే , వెంకీ మామ మూవీస్ విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. క్రాంతి మాధవ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా జంటగా రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

లక్కీ డేట్ కే వస్తున్న మహేష్ బాబు!
సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంక్రాంతి పండగతో మంచి అనుబంధమే ఉంది. `ఒక్కడు`, `బిజినెస్ మేన్`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ని ఈ సీజన్ లోనే అందుకున్నాడు మహేష్. కట్ చేస్తే... సుదీర్ఘ విరామం తరువాత మరోసారి ముగ్గుల పండక్కి తన సినిమాతో పలకరించబోతున్నాడీ హ్యాండ్సమ్ హీరో.
'RRR' హాలీవుడ్ తారల విశేషాలు
రాజమౌళి సినిమాలో నటించే ఎవరికైనా తక్కువ టైం లో ఎక్కువ గుర్తింపు వస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే రాజమౌళి సినిమాలో తక్కువ పాత్ర వున్నా కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇక్కడ నటీనటులకే కాదు... ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ తో హాలీవుడ్ నటీనటులకు కూడా ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. రెండు రోజుల క్రితమే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ను, విలన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి వారి వివరాలు ఏంటో తెలుసుకుందాం..

రామోజీ ఫిల్మ్ సిటీ లో యువ హీరోల సందడి
రామోజీ ఫిల్మ్ సిటీ లో హీరోలు నాని, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్ తమ మూవీస్ షూటింగ్స్ తో సందడి చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా రూపొందుతున్న "V" మూవీ షూటింగ్ ఆర్ ఎఫ్ సి లో జరుగుతుంది. ఈ మూవీ లోని రైల్వే స్టేషన్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

ది వరల్డ్ ఆఫ్ #NC19 రిలీజ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై వైవిధ్య భరిత చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా అందమైన ప్రేమకథ గా #NC19 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య తెలంగాణ యాస లో డైలాగ్స్ పలకడం విశేషం. #NC19 మూవీ లోని నాగ చైతన్య లుక్ ను 22 వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

"మోసగాళ్ళు " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు మంచు నిర్మాణ సారథ్యంలో జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ప్రపంచ అతి పెద్ద ఐ. టి స్కామ్ నేపథ్యంలో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, రుహానీ శర్మ, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ రూపొందుతుంది. హైదరాబాద్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ మూవీ షూటింగ్ లాస్ ఏంజెల్స్ లో జరుగనుంది.
'ఆదిత్య వర్మ' కూడా కొట్టేశాడుగా..!
విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంప్లీట్ బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకోవడమే కాకుండా విజయ్ కెరీర్ నే మార్చేసింది. ఇక హిందీ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ల పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. షాహిద్ కపూర్ కూడా ఈ సినిమాలోని పాత్రలో ఒదిగిపోయి నటించేసాడు. ఇక ఈ సినిమాను తమిళ్ కూడా రీమేక్ చేసిన సంగతి విదితమే. తమిళ్ టాలెంటెడ్ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమా రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే తెలుగు, హిందీ లో సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై…
'వీరశాస్త్ర అయ్యప్ప కటాక్షం' ట్రైలర్ రిలీజ్
తెలుగులో ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సుమన్ ఆ తర్వాత.. పలు కీలక పాత్రల్లో నటిస్తూ వెళ్తున్నారు. ఎన్నో యాక్షన్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో సక్సెస్ అందుకున్నారు సుమన్ అంతేకాదు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రతో, శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్ర తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు.
మీరే మాకు స్పూర్తి..!
తన సినీ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మంచు మోహన్ బాబు. ముక్కుసూటి తనం, క్రమశిక్షణ, విభిన్నమైన డైలాగ్ డెలివరీ ఇవన్నీ మోహన్ బాబు కు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు.. ఈ రోజుతో సినీ పరిశ్రమలో మోహన్ బాబు 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
మూవీ మాఫియా అంటున్న కంగనా సోదరి - ఈసారి టాపిక్‌లోకి రౌడీ బాయ్..!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగనా జోలికి ఎవరైనా వచ్చారంటే అంతే సంగతులు. అంతేకాదు బాలీవుడ్ లో వున్న కొంతమందిని టార్గెట్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ తో సంచలనం సృష్టిస్తూనే ఉంటుంది. కరణ్ జోహార్ పై,నేపోటిజం పై ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ వేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మరోసారి మూవీ మాఫియా అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి టాపిక్‌లోకి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా రావడం గమనార్హం.

అఫీషియల్ - రిలీజ్ డేట్స్ వచ్చేశాయి, మహేష్ తర్వాత బన్నీ
ఈ మధ్య సినిమాల రిలీజ్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతున్నారు దర్శకనిర్మాతలు. ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. ఇంతకుముందు 'వాల్మీకి', 'గద్దలకొండ గణేష్' సినిమాల రిలీజ్ విషయంలో కన్ఫ్యూషన్ ఉండగా అప్పుడు నిర్మాతలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చి ఒక వారం ఒక సినిమా మరొక వరం ఒక సినిమా రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు బన్నీ, మహేష్ సినిమాలకు కూడా అలానే జరిగింది.

'సరిలేరు నీకెవ్వరు' టీజర్ రిలీజ్ - భయపడే వాడే బేరానికి వస్తాడు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పోస్టర్ లు మాత్రమే రిలీజ్ చేశారు.. మొత్తానికి ఇప్పటికి మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకొనే టైమ్ వచ్చేసింది. ఈ టైం కోసమే ఎప్పటినుండో ఎదుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులను బ్రేక్ చేస్తూ టీజర్ ను రిలీజ్ చేసేసారు.

భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీ ట్రైలర్ పై రాజమౌళి స్పందన
ఆకృతి &ఆశ్రిత సమర్పణ లో ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ శ్రీనివాస రెడ్డి హీరో, నిర్మాత, దర్శకుడిగా ఒక మంచి రసగుల్లా లాంటి సినిమా ట్యాగ్ లైన్ తో రూపొందిన కామెడీ ఎంటర్ టైన్ మెంట్ భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు మూవీడిసెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది. సత్య, షకలక శంకర్, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్యం రాజేష్, ప్రవీణ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి సంగీతం సాకేత్ కోమండూరి , స్టోరీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ జయమ్ము నిశ్చయమ్మురా మూవీ ఫేమ్ పరం సూర్యాన్షు అందించారు