‘రొమాంటిక్’ గోవా షెడ్యూల్ పూర్తి

Romantic Movie Goa Schedule Wrapped Up,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Romantic Movie Shooting in Goa,Romantic Movie Shooting Updates,Romantic Movie Latest News

అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రొమాంటిక్’. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక గతకొద్ది కాలంగా ఈ సినిమా గోవా లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. 30 రోజుల పాటు జ‌రిగిన ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్‌, పూరి మార్క్ బీచ్ సాంగ్ ను షూట్ చేశారు. ఈ సందర్భంగా ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ గోవా షెడ్యూల్ పూర్తి అయిందని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ఆకాష్ పూరీ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అంతేకాదు.. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే కూడా పూరీనే అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఆకాష్ పూరీకి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + fourteen =