ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 13
మాస్ ఎంటర్‌టైనర్ కోసం కొత్త అవతారం..!
ఉమెన్ సెంట్రిక్ మూవీస్ నిర్మాతగా సమంత
రంగమార్తాండ మూవీలో కీలక పాత్రలో అనసూయ
`పింక్` రీమేక్ కి థమన్ బాణీలు?
ఫిబ్రవరిలో ప్రేమకథల సందడి
రజనీకి పోటీగా వస్తానంటున్న ప్రభుదేవ..!

మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుష్క?

ఫిబ్రవరి 7న `96` రీమేక్
సినీరంగ ప్రవేశం చేస్తున్న లక్ష్మీ పార్వతి..?

వినాయక్ కు జోడీగా శ్రేయ..?

ఫైనల్లీ చైతు తో 'గీత గోవిందం' డైరెక్టర్..!
దర్శకుడు శ్రీనివాస రెడ్డి కొత్త మూవీ "భార్యదేవోభవ "
శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణ లో శ్రీ నవహస్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ" రాగల 24 గంటల్లో" 22 తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. మూవీ సక్సెస్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా తో సమావేశమయింది. దర్శకుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ .. ఇదేప్రొడక్షన్ హౌస్ లో తన దర్శకత్వంలో మరొక మూవీ రూపొందనుందని తెలిపారు.
మాస్ ఎంటర్‌టైనర్ కోసం కొత్త అవతారం..!
వరుస ప్లాప్స్ తో సతమతమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తమిళ్ సూపర్ హిట్ మూవీ 'రాచ్చసన్' ను తెలుగులో 'రాక్షసుడు' పేరుతో రీమేక్ చేసి ఫైనల్ గా హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు మరోసారి తనకు మాస్ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. కందిరీగ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తున్నాడు. సంతోష్ మూడేళ్ల విరామం తరువాత తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.

వర్మ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' - టీజర్, ట్రైలర్ రిలీజ్ డేట్లు ఫిక్స్
ఎవరేం అనుకున్నా డోంట్ కేర్ అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు వర్మ. ఒక సినిమా తర్వాత మరో సినిమాను వెంట వెంటనే చేస్తున్నాడు. హిట్‌తో సంబంధం లేకుండా, కలెక్షన్లతో ప్రభావితం కాకుండా సినిమాలు తీసుకుంటూ పోవటమే ఆయన పని. ఒక పక్క 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ' ఏపీ లోని ప్రస్తుత రాజకీయాలతోనే ఒక సినిమా తీస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్, ట్రయిలర్, పాటలతో ఎంత సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉమెన్ సెంట్రిక్ మూవీస్ నిర్మాతగా సమంత
టాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత ఓ బేబీ మూవీ ఘనవిజయం తరువాత 96 తమిళ మూవీ తెలుగు రీమేక్ జాను మినహా మరే మూవీ ని అంగీకరించలేదు. తన సొంత బ్యానర్ పై ఉమెన్ సెంట్రిక్ మూవీస్ నిర్మించాలని సమంత అనుకొంటున్నట్టు సమాచారం. మహిళా సాధికారికత ను ప్రమోట్ చేయాలనుకుంటున్నారు.
రంగమార్తాండ మూవీలో కీలక పాత్రలో అనసూయ
సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో రంగమార్తాండ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మరాఠీ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రంగమార్తాండ మూవీ రూపొందుతుంది 1998 సంవత్సరంలో చంద్రలేఖ మలయాళ మూవీ ని చంద్రలేఖ పేరు తో తెలుగులో రీమేక్ చేసిన కృష్ణ వంశీ తిరిగి ఇన్ని సంవత్సరాల తరువాత మరో రీమేక్ మూవీ కి దర్శకత్వం వహించడం విశేషం.
`ఆర్ ఆర్ ఆర్` కోసం రామ్ చరణ్, ఆలియా రొమాంటిక్ సాంగ్
`డైరెక్టర్ నంబర్ వన్` యస్.యస్.రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. తెలుగు పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాలను మిళితం చేస్తూ జక్కన్న రూపొందిస్తున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్ లో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ... ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
`పింక్` రీమేక్ కి థమన్ బాణీలు?
హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్` తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ కోర్టు డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. `ఎంసీఏ` దర్శకుడు వేణు శ్రీరామ్ రూపొందించనున్న ఈ సినిమాని `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎంపికయ్యాడని సమాచారం. అదే గనుక నిజమైతే.. పవర్ స్టార్ కాంబినేషన్ లో థమన్ కి ఇదే తొలి సినిమా అవుతుంది. త్వరలోనే థమన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి... ఇప్పటికే మెగా కాంపౌండ్ లో పలు…
వచ్చే నెల 5న ప్రారంభం కానున్న రజనీకాంత్ కొత్త చిత్రం
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ మధ్య జోరు పెంచారు. వరుస చిత్రాలతో అభిమానుల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఎంతలా అంటే... ఒకవైపు తాజా చిత్రం `దర్బార్` విడుదలకు ముస్తాబవుతుంటే... మరోవైపు నెక్ట్స్ ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టే పనిలో ఉన్నారాయన.

2020లో వరుసగా మూడు నెలల పాటు `దిల్` రాజు చిత్రాలు
2017లో రికార్డు స్థాయిలో ఆరు చిత్రాలు విడుదల చేయడమే కాకుండా ఘనవిజయాలు అందుకుని మరీ వార్తల్లో నిలిచాడు నిర్మాత `దిల్` రాజు. కట్ చేస్తే... 2020లో అంతకుమించిన సంఖ్యలో సినిమాలను ప్లాన్ చేశాడు ఈ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఆసక్తికరమైన విషయమేమిటంటే... వీటిలో మూడు సినిమాలు మొదటి మూడు నెలలను టార్గెట్ చేసుకోవడం విశేషం.
ఫిబ్రవరిలో ప్రేమకథల సందడి
2020 ఫిబ్రవరి ప్రేమకథా చిత్రాలకు చిరునామాగా నిలవనుంది. వరుసగా మూడు వారాల పాటు వెండితెరపై ప్రణయగాథలు సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే `96` రీమేక్, `వరల్డ్ ఫేమస్ లవర్`, `భీష్మ`.
చరణ్-అలియా రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ..!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
రజనీకి పోటీగా వస్తానంటున్న ప్రభుదేవ..!
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక తాజాగా రజనీ తన పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేద్దామని చూస్తున్న సంగతి కూడా విదితమే. ఇదే పొంగల్ పోరులో మన తెలుగు సినిమాలు పోటీకి సిద్ధంగా వున్నాయి. ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 11 'సరిలేరు నీకెవ్వరు' 12న ‘అల వైకుంఠపురములో, విడులవుతున్నాయి…

పాట చిత్రీకరణలో `ప్రతి రోజూ పండగే`
`సుప్రీమ్` తరువాత సాయితేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం `ప్రతి రోజూ పండగే`. తాతమనవళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని మారుతి తెరకెక్కిస్తున్నాడు. ఒక పాట మినహా ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది. కాగా... ప్రస్తుతం మిగిలి ఉన్న ఆ గీతాన్ని హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. సాయితేజ్, రాశీఖన్నాపై చిత్రీకరిస్తున్న ఈ యుగళగీతానికి శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చుతున్నాడు. కలర్ ఫుల్ గా సాగే ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్…

మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుష్క?
ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఈ తరం కథానాయికల్లో అనుష్క ఒకరు. ఇప్పటికే `అరుంధతి, పంచాక్షరి, వర్ణ, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి` వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించిన స్వీటీ... త్వరలో `నిశ్శబ్దం`తో పలకరించబోతోంది. ఈ నాయికా ప్రాధాన్య చిత్రంలో అనుష్క మూగ అమ్మాయిగా కనిపించనుంది.

ఫిబ్రవరి 7న `96` రీమేక్
తమిళనాట ఘనవిజయం సాధించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ `96`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి తమిళ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా... `దిల్` రాజు నిర్మించాడు. కాగా...ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత `దిల్` రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. మరి... ప్రేమికుల దినోత్సవానికి వారం రోజుల ముందుగా రాబోతున్న ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.
కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' టీజర్
కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా 'సరిలేరు నీకెవ్వరు' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ అలా రిలీజ్ చేసారో లేదో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. విడుదలైన 9 నిమిషాలలోనే 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను దక్కించుకున్న ఈ సినిమా టీజర్ రియల్ టైం లో కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఇక 24 గంటల్లో 14 మిలియన్ వ్యూస్ తో నెం.1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ టీజర్.
'అర్జున్ సురవరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా..!
టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా 'అర్జున్ సురవరం' తెరకెక్కిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మాత్రం రిలీజ్ కష్టాలు మాములుగా రాలేదు. పలుమార్లు రిలీజ్ డేట్ వేసుకొని. నవంబర్ 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
సినీరంగ ప్రవేశం చేస్తున్న లక్ష్మీ పార్వతి..?
ఇన్ని రోజులు రాజకీయ రంగంలో వున్న లక్ష్మీ పార్వతి ఇప్పుడు సినీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ప్రస్తుతం ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తుంది. నాటకరంగంలో ఆమెకు ప్రవేశం వుంది కానీ సినీరంగానికి కొత్త. ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు కూడా సిద్ధమైంది.

వినాయక్ కు జోడీగా శ్రేయ..?
ఎన్నో కమర్షియల్ హిట్స్ ను టాలీవుడ్ కు అందించిన స్టార్ డైరెక్టర్ వినాయక్ ఇప్పుడు హీరో గా వస్తున్న సంగతి తెలిసిందే. ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహా దర్శకత్వంలో.. వివి వినాయక్ హీరోగా ‘సీనయ్య’ అనే సినిమాలో చేస్తున్నాడు. గతం నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా సీనియర్ నటిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకప్పటి టాప్ హీరోయిన్ శ్రేయ శరన్ ఈ సినిమాలో వినయ్ కు జోడీగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ఫైనల్లీ చైతు తో 'గీత గోవిందం' డైరెక్టర్..!
విజయ్ దేవరకొండ హీరోగా కన్నడ బూటీ కథానాయికగా పరుశురాం దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన చిత్రం గీత గోవిందం. ‘గీతా గోవిందం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పరుశురాం.. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా కొత్త సినిమాను మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే మొదట పరుశురాం మహేష్ తో సినిమా చేస్తున్నాడన్నారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత కూడా ఆ హీరో చేస్తున్నాడు..ఈ హీరో తో చేస్తున్నాడు అన్నారు కానీ అవన్నీ వార్తలు గానే మిగిలాయి తప్ప ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఒక వార్త వినిపిస్తుంది.