ల‌క్కీ డేట్ కే వ‌స్తున్న మ‌హేష్‌ బాబు!

Mahesh Babu New Movie To Release On A Lucky Date,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Mahesh Babu New Movie,Super Star Mahesh Babu New Movie Release Date,Mahesh Babu Release Lucky Date

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబుకి సంక్రాంతి పండ‌గ‌తో మంచి అనుబంధ‌మే ఉంది. `ఒక్క‌డు`, `బిజినెస్ మేన్`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్స్ ని ఈ సీజ‌న్ లోనే అందుకున్నాడు మ‌హేష్‌. క‌ట్ చేస్తే… సుదీర్ఘ విరామం త‌రువాత మ‌రోసారి ముగ్గుల పండ‌క్కి త‌న సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడీ హ్యాండ్స‌మ్ హీరో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

`స‌రిలేరు నీకెవ్వ‌రు` పేరుతో రూపొందిన ఈ ప‌ర్‌ఫెక్ట్ ఫెస్టివ‌ల్ పిక్చ‌ర్… 2020 సంక్రాంతి బ‌రిలో సంద‌డి చేయ‌నుంది. జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య ప్ర‌క‌టించినా… తాజాగా అనుకున్న తేది కంటే ఒక రోజు ముందే (జ‌న‌వ‌రి 11) ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే…జ‌న‌వ‌రి 11 మ‌హేష్ కి ల‌క్కీ డేట్. ఏడేళ్ళ క్రితం ఇదే తేదిన `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ అయింది. మ‌రి… ఆ చిత్ర నిర్మాత `దిల్‌` రాజు కాంబినేష‌న్ లోనే అదే తేదికి మ‌రోసారి రాబోతున్న మ‌హేష్‌… `స‌రిలేరు నీకెవ్వ‌రు`తోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంటాడేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 6 =