ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 12
అంధాధున్ మూవీ తెలుగు రీమేక్ నిర్మాత నితిన్
ప్రయోగాత్మక చిత్రాలలో స్టార్ హీరోయిన్స్

'ఎంత మంచివాడవురా' షూటింగ్ పూర్తి

"రంగమార్తాండ" మూవీ లో స్టార్ కమెడియన్
ఈ నెల 29న యన్టీఆర్ `విజయన్`
మరోసారి ముఖ్యమంత్రిగా బాలకృష్ణ?
ఫారెస్ట్ ఆఫీసర్ గా రష్మిక?
వరుణ్ తేజ్ కి జోడీగా `ఇస్మార్ట్` భామలు?
ఐదోసారి జట్టుకట్టనున్న చైతూ-సామ్?
కొత్త సినిమా వివరాలు త్వరలో..!
తమన్ కు సుప్రీమ్ హీరో స్పెషల్ గిఫ్ట్

'నిశ్శబ్దం' నుండి షాలినీ పాండే లుక్ రిలీజ్

కంగనా నిర్మాతగా 'అయోధ్య' ఇష్యూ పై సినిమా..!

'రంగ మార్తాండ' షూటింగ్ ప్రారంభం
భారతీయుడు 2 మూవీ లో విలన్ గా విజయ్ సేతుపతి

"దొంగ" మూవీ సెకండ్ లుక్ రిలీజ్
'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజా గా టీజర్ ను రిలీజ్ చేసింది. ఇక టీజర్ అలా రిలీజ్ చేసారో లేదో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కానీ విధంగా ఈ టీజర్ ఆల్ టైం రికార్డ్స్ బద్దలు కొట్టేస్తుంది. టీజర్ క్లాస్ మాస్ అభిమానులను బాగా ఆకర్షించడంతో సోషల్ మీడియాలో దుమ్ము దులిపే రికార్డులు సృష్టిస్తూ...రికార్డులను సృష్టిస్తూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
అంధాధున్ మూవీ తెలుగు రీమేక్ నిర్మాత నితిన్
యువ హీరో నితిన్ భీష్మ, రంగ్ దే, చదరంగం మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం లో మూడు సినిమాలతో అభిమానులను, ప్రేక్షకులను నితిన్ అలరించనున్నారు. బాలీవుడ్ లో 32 కోట్లతో నిర్మించిన అంధాధున్ మూవీ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 456 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ప్రయోగాత్మక చిత్రాలలో స్టార్ హీరోయిన్స్
తమ అందం, అభినయం తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే స్టార్ హీరోయిన్స్ కమర్షియల్ పంథా కు భిన్నంగా నవ్యతకు ప్రాధాన్యత నిస్తూ ప్రయోగాత్మక పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. బ్లాక్ బస్టర్ "భాగమతి" మూవీ తరువాత అనుష్క ఒక థ్రిల్లర్ మూవీ ని ఎంపిక చేసుకొన్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన "నిశ్శబ్ధం" మూవీ లో అనుష్క మూగ చిత్రకారిణి గా నటించారు. ఆ క్యారెక్టర్ కై అనుష్క ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.

'ఎంత మంచివాడవురా' షూటింగ్ పూర్తి
‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఆఖరి షెడ్యూల్ కోసం కేరళలోని మున్నార్ కు వెళ్ళింది చిత్రయూనిట్. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

"రంగమార్తాండ" మూవీ లో స్టార్ కమెడియన్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న "రంగమార్తాండ" మూవీ షూటింగ్ నిన్న వైజాగ్ లో ప్రారంభమయింది. మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న" రంగమార్తాండ" మూవీ ప్రారంభోత్సవం లో డైరెక్టర్ తేజ పాల్గొని ఫస్ట్ షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టారు. అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్ర కు ఎంపిక అయ్యారు. అభిషేక్, మధు నిర్మాణసారథ్యంలోరూపొందుతున్న"రంగమార్తాండ" మూవీ కి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
ఈ నెల 29న యన్టీఆర్ `విజయన్`
యంగ్ టైగర్ యన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో `యమదొంగ` ఒకటి. `స్టూడెంట్ నెం.1`, `సింహాద్రి` తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్ నటించిన ఈ సినిమా... వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా నిలచింది. అంతేకాదు... 2007 సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లో హయ్యస్ట్ గ్రాసర్ గానూ నిలచింది.
మరోసారి ముఖ్యమంత్రిగా బాలకృష్ణ?
`యన్టీఆర్ మహానాయకుడు` చిత్రంలో ముఖ్యమంత్రిగా దర్శనమిచ్చిన నటసింహ నందమూరి బాలకృష్ణ... త్వరలో మరో సినిమాలోనూ సీఎమ్ గా కనిపించబోతున్నారట.
ఫారెస్ట్ ఆఫీసర్ గా రష్మిక?
వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతోంది కథానాయిక రష్మికా మందణ్ణ. `ఛలో` నుంచి `డియర్ కామ్రేడ్` వరకు ఒకదానితో ఒకటి పొంతన లేని భూమికల్లో దర్శనమిచ్చిన ఈ కన్నడ కస్తూరి... చిత్రీకరణ తుది దశలో ఉన్న `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాల్లోనూ ఇదివరకు నటించని పాత్రల్లో కనిపించబోతోంది.
వరుణ్ తేజ్ కి జోడీగా `ఇస్మార్ట్` భామలు?
ఈ ఏడాది `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాలతో విజయాలు అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్న సంగతి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కాగా... ఈ చిత్రంలో వరుణ్ కి జోడీగా `ఇస్మార్ట్ శంకర్` కథానాయికలు నిధి అగర్వాల్, నభా నటేష్ నటించబోతున్నారని సమాచారం.
ఐదోసారి జట్టుకట్టనున్న చైతూ-సామ్?
`ఏమాయ చేసావె`, `మనం`, `ఆటోనగర్ సూర్య`, `మజిలీ` చిత్రాల్లో జంటగా నటించి అలరించారు నాగచైతన్య, సమంత. అలాగే పెళ్ళికి ముందు `మనం`లోనూ, పెళ్ళి తరువాత `మజిలీ`లోనూ భార్యాభర్తల పాత్రల్లో దర్శనమిచ్చారు. కట్ చేస్తే... ఈ ఇద్దరూ మరోసారి జంటగా నటించేందుకు సిద్ధమవుతున్నారని టాక్.
కొత్త సినిమా వివరాలు త్వరలో..!
మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్ కు తన సినీ కెరీర్ చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి కూడా లేదని చెప్పొచ్చు. కొంతకాలంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడంతో ఇటీవలే మంచు మనోజ్ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. దాంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇకపోతే విడాకుల అనంతరం తాను మాళ్ళీ తనకు ఇష్టమైన ఇండస్ట్రీలోకి వచ్చేశాడు.
తమన్ కు సుప్రీమ్ హీరో స్పెషల్ గిఫ్ట్
ప్రస్తుతం తమన్ ఫుల్ ఫామ్ లో వున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'అల వైకుంఠపురములో' నుండి విడుదల చేసిన 'సామజవరగమనా', 'రాములో రాముల' పాటలు యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ‘ప్రతి రోజు పండగే’ సినిమాకు కూడా ఈయన సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఈ పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశాడు తమన్.

ఉదయ్ కిరణ్ బయోపిక్ కు యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్..!
ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా నడుస్తున్న నేపథ్యంలో.. ఎవరో ఒక సెలబ్రిటీ పేరుతో వాళ్ల బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కించారు. ఇంకా కొంత మంది బయోపిక్ లు కూడా రూపొందుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్నో హిట్ సినిమాలు తీసి.. దివికేగిన ఉదయకిరణ్ బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్నట్టు గతకొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

2019 టాప్ 7 బర్త్ డే ట్రెండ్స్ - సోషల్ మీడియాను మోతమోగించిన మన హీరోలు..!
మన తెలుగు సినీ పరిశ్రమలో హీరోలపై అభిమానులు తమ అభిమానాన్ని ఆ రేంజ్ లో చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సంఘటనలే చూసుంటాం. మరి అలాంటి అభిమానులు తమ అభిమాన హీరోల పుట్టినరోజులు వస్తే ఊరుకుంటారా.. సోషల్ మీడియాను తమ పోస్టులతో ఒక ఊపు ఊపెయ్యరు. అలా తమ అభిమానంతో చేసిన మిలియన్ పోస్టులతో, విషెస్ తో మోతమోగించేసారు. మరి 2019 టాప్ 7 బర్త్ డే ట్రెండ్స్ ఎవరో ఒకసారి చూద్దామా..!

అప్పుడే మొదలైన మహేష్ మేనియా - భారీ కటౌట్ ఏర్పాటు..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా 'సరిలేరు నీకెవ్వరు' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.

'నిశ్శబ్దం' నుండి షాలినీ పాండే లుక్ రిలీజ్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్ లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ నటుడు…

కంగనా నిర్మాతగా 'అయోధ్య' ఇష్యూ పై సినిమా..!
విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ బాలీవుడ్ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. ప్రస్తుతం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు కంగనా మరో డేరింగ్ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

'రంగ మార్తాండ' షూటింగ్ ప్రారంభం
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో 'రంగ మార్తాండ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉండగా నేడు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ విషయాన్నీ కృష్ణవంశీ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఫస్ట్ షాట్ ను సెన్సేషనల్ డైరెక్టర్.. నా చిరకాల మిత్రుడు తేజ డైరెక్ట్ చేసాడు.. థాంక్యూ తేజ అంటూ ట్వీట్ చేసాడు.
భారతీయుడు 2 మూవీ లో విలన్ గా విజయ్ సేతుపతి
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్, భారీ తారాగణం తో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2(భారతీయుడు 2)రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ లో ప్రతినాయకుడు గా సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ సేతుపతి ఎంపికయ్యారు.

"దొంగ" మూవీ సెకండ్ లుక్ రిలీజ్
బ్లాక్ బస్టర్ మూవీ "ఖైదీ" తో ప్రేక్షకులను అలరించిన కార్తీ మరో కొత్త మూవీ తో అలరించనున్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం లో కార్తీ హీరోగా "తంబి" తమిళ మూవీ రూపొందింది. జ్యోతిక, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఆ మూవీ కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ "దొంగ "మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.