ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా నడుస్తున్న నేపథ్యంలో.. ఎవరో ఒక సెలబ్రిటీ పేరుతో వాళ్ల బయోపిక్ కూడా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కించారు. ఇంకా కొంత మంది బయోపిక్ లు కూడా రూపొందుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్నో హిట్ సినిమాలు తీసి.. దివికేగిన ఉదయకిరణ్ బయోపిక్ కూడా తెరకెక్కిస్తున్నట్టు గతకొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే గతంలో ఈ బయోపిక్ ను ఉదయ్ కిరణ్ ను స్టార్ హీరోగా నిలబెట్టిన తేజ తెరకెక్కించే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై స్పందించిన తేజ వాటిని ఖండిస్తూ క్లారిటీ ఇచ్చాడు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలన్నీ ఉదయ్ నాతో పంచుకునేవాడు. అతని రహస్యాలూ నాకు తెలుసు. అయినప్పటికీ అతని జీవితం ఆధారంగా నేను సినిమా తీయను అని చెప్పేసాడు.
ఇకపోతే సినిమాకు సంబందించి తాజాగా ఓ వార్త వినిపిస్తుంది .. ఓ యంగ్ హీరో ఈ బయోపిక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అతనెవరో కాదు సందీప్ కిషన్. సందీప్ కిషన్ ఉదయ్ కిరణ్ పాత్రలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు ఈ బయోపిక్ ని డైర్టెక్ట్ చేసే అవకాశం ఉంది. 2020జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్స్ కూడా రెడీ అవుతున్నట్లు టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: