ఈ ఏడాది `ఎఫ్ 2`, `గద్దలకొండ గణేష్` చిత్రాలతో విజయాలు అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా ఓ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్న సంగతి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. కాగా… ఈ చిత్రంలో వరుణ్ కి జోడీగా `ఇస్మార్ట్ శంకర్` కథానాయికలు నిధి అగర్వాల్, నభా నటేష్ నటించబోతున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాస్తవానికి, బాలీవుడ్ భామ కియారా అద్వాని ఈ సినిమాలో ఓ నాయికగా నటించే అవకాశముందని ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే, కియారా హిందీలో పలు చిత్రాలతో బిజీగా ఉండడంతో… ఆ పాత్రలో నిధిని ఎంచుకున్నారని టాక్. మరో నాయికగా ఇప్పుడు నభా కూడా తోడయిందట. త్వరలోనే `ఇస్మార్ట్` భామల ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న వరుణ్ – కిరణ్ కాంబినేషన్ మూవీ… వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: