‘నిశ్శబ్దం’ నుండి షాలినీ పాండే లుక్ రిలీజ్

Shalini Pandey Look Revealed From Nishabdham,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Shalini Pandey Look From Nishabdham,Shalini Pandey First Look From Nishabdham Movie,Nishabdham Movie Updates

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్ లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న షాలిని పాండే పోస్టర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆమె ఈ సినిమాలో ‘సోనాలి’ అనే పాత్రలో కనిపించనుందనే విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారా తెలియపరిచారు. ఇక ఈ సినిమాలో మాధవన్, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =