ప్రస్తుతం తమన్ ఫుల్ ఫామ్ లో వున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ నుండి విడుదల చేసిన ‘సామజవరగమనా’, ‘రాములో రాముల’ పాటలు యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ‘ప్రతి రోజు పండగే’ సినిమాకు కూడా ఈయన సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఈ పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశాడు తమన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా తమన్ కు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ సర్ ప్రైజ్ చేసాడట సాయి తేజ్. తమన్ మ్యూజిక్ టేస్ట్ కి తగ్గట్టుగా పెర్ల్ మాలెట్‌స్టేషన్ అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గిఫ్ట్ గా ఇచ్చాడట. తనకు సాయి ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్‌ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్ లో ఫొటోతో సహా పోస్ట్ చేసాడు.
కాగా మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా ప్రతిరోజు పండగే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా…అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: