మన తెలుగు సినీ పరిశ్రమలో హీరోలపై అభిమానులు తమ అభిమానాన్ని ఆ రేంజ్ లో చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సంఘటనలే చూసుంటాం. మరి అలాంటి అభిమానులు తమ అభిమాన హీరోల పుట్టినరోజులు వస్తే ఊరుకుంటారా.. సోషల్ మీడియాను తమ పోస్టులతో ఒక ఊపు ఊపెయ్యరు. అలా తమ అభిమానంతో చేసిన మిలియన్ పోస్టులతో, విషెస్ తో మోతమోగించేసారు. మరి 2019 టాప్ 7 బర్త్ డే ట్రెండ్స్ ఎవరో ఒకసారి చూద్దామా..!
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్
ఈ లిస్ట్ లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్. సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలపై గతకొద్దికాలంగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ రోజు ట్విట్టర్ మోత మోగిపోయింది నాయి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. #HappyBirthdayPawanKalyan హ్యాష్ ట్యాగ్ ఇండియాలోనే టాప్-1 ట్రెండింగ్‌లో నిలిచింది. 10.5 మిలియన్ ట్వీట్స్ తో టాప్ ప్లేస్ లో వున్నారు. మరి సినిమాలో నటించకపోయిన ఈ రేంజ్ లో ట్వీట్స్ వచ్చాయంటే గ్రేటే.
మహేష్ బాబు
ఇక పవన్ తర్వాత ఆ రేంజ్ లో బర్త్ డే ట్వీట్స్ దక్కించుకున్న హీరో మహేష్ బాబు. మహేష్ బాబు కు సోషల్ మీడియాలో వున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ కు సంబంధించిన అప్ డేట్ ఏదైనా వస్తే.. కొద్దినిమిషాల్లోనే అది టాప్ ట్రెండింగ్ లోకి వస్తుంది. దీనికి ప్రెష్ ఎగ్జాంపులే సరిలేరు నీకెవ్వరు టీజర్. ఈ టీజర్ ను రిలీజ్ చేసిన 9 మినిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాంటిది మహేష్ పుట్టిన రోజు అంటే ఇంకే రేంజ్ లో ఉంటుంది. మహేష్ బర్త్ డే కు ఏకంగా 8.7 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి.
ప్రభాస్
ఇక వీరి తర్వాత మూడో స్థానం దక్కించుకున్న హీరో ప్రభాస్. నిజానికి ప్రభాస్ కెరీర్ ను ఆఫ్టర్ బాహుబలి.. బిఫోర్ బాహుబలి అని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఇంటెర్నేషనల్ రేంజ్ లో పెరిగిపోయింది. మన దేశంలోనే కాదు పక్క దేశంలో కూడా అభిమానులను చేసుకున్నాడు. మరి ఇంత రేంజ్ వచ్చిన ప్రభాస్ కు పుట్టినరోజు నాడు ఆ రేంజ్ లో విషెస్ రావడం మాములు విషయమే కదా. తన పుట్టిన రోజు నాడు 1.1 మిల్లియన్లతో అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
అల్లు అర్జున్
ఇక ఈ లిస్ట్ లో నాలుగో స్థానంలో ఉన్న హీరో అల్లు అర్జున్. తన స్టైల్ తో, తన ఎనర్జిటిక్ నటనతో, డాన్స్ లతో ఎంతో మంది అభిమానులను సొంత చేసుకున్నాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ఇక్కడే కాదు కేరళ లో కూడా ఏ హీరో కి లేనంత ఫాలోయింగ్ అల్లు అర్జున్ కు ఉంది. ఇక అల్లు అర్జున్ తన పుట్టిన రోజు నాడు 456కె పోస్ట్ లతో అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
జూ.ఎన్టీఆర్
అల్లుఅర్జున్ తర్వాత స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్. యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా ఎదిగి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. రూపంలో తాత పోలికలే కాదు. అభినయంలోను ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు జూనియర్. ఏ పాత్ర అయినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు వందశాతం న్యాయం చేస్తాడు. బాల నటుడిగా చేసినప్పుడే నంది అవార్డు సైతం అందుకున్నాడు తారక్. ఆ తర్వాత 2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా పరిచయం అయి.. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఎన్టీఆర్ తన పుట్టిన రోజు నాడు 400కె పోస్ట్ లతో అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
రామ్ చరణ్
ఎన్టీఆర్ తర్వాత స్థానం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దక్కింది. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ కు ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదని చెప్పొచ్చు. ఆ తర్వాత పలు విమర్శలే ఎదుర్కోవాల్సి వచ్చింది చరణ్. అలా తన విమర్శలన్నీ పాజిటివ్ గా తీసుకొని.. తన నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ తన పుట్టిన రోజు నాడు 270కె పోస్ట్ లతో అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకొని ఆరో స్థానంలో నిలిచాడు.
నాగ చైతన్య
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లిస్ట్ లో నాగ చైతన్య కూడా చోటు సంపాదించుకున్నాడు. అక్కినేని వారసుడిగా జోష్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు చై. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా ఫిలిం ఫేర్, నంది అవార్డును సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య. ‘ఏం మాయ చేశావే’ సినిమా సూపర్ హిట్ తో ఇక వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు చైతు కి. ఆ సినిమా తర్వాత ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. తన నుంచి ఫ్యాన్స్ కు ఏం కావాలో అది అందిస్తూ హీరోగా తనను తాను నిలబెట్టుకుంటున్నారు చైతు. మజిలీ సినిమాలో తన నటన అంటే ఎలా ఉంటుందో చూపించి మెప్పించాడు. ఇక నవంబర్ 23న చైతు పుట్టినరోజు జరిగింది. ఇక ఆ రోజు 225కె పోస్ట్ లతో అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు చై.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: