ప్రయోగాత్మక చిత్రాలలో స్టార్ హీరోయిన్స్

Star Heroines Take Up Experimental Roles,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Star Actress Experimental Roles,Tollywood Actors Experimental Roles,Telugu Actress Experimental Roles

తమ అందం, అభినయం తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే స్టార్ హీరోయిన్స్ కమర్షియల్ పంథా కు భిన్నంగా నవ్యతకు ప్రాధాన్యత నిస్తూ ప్రయోగాత్మక పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. బ్లాక్ బస్టర్ “భాగమతి” మూవీ తరువాత అనుష్క ఒక థ్రిల్లర్ మూవీ ని ఎంపిక చేసుకొన్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన “నిశ్శబ్ధం” మూవీ లో అనుష్క మూగ చిత్రకారిణి గా నటించారు. ఆ క్యారెక్టర్ కై అనుష్క ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి” లో కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు ను సొంతం చేసుకొన్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా లో కీర్తి సురేష్ షూటర్ గా నటిస్తున్నారు. ఒక గ్రామీణ యువతీ అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్ క్రీడలో విజేతగా నిలిచిన నేపథ్యం లో ఈ మూవీ రూపొందుతుంది. సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న మూవీ లో తమన్నా కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు.

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార “నెట్రికన్” తమిళ మూవీ లో అంధురాలిగా నటిస్తున్నారు. విరాటపర్వం మూవీ లో సాయి పల్లవి నక్సలైట్ గా, A 1 ఎక్స్ ప్రెస్ మూవీ లో లావణ్య త్రిపాఠి హాకీ క్రీడాకారిణి గా, సుజన దర్శకత్వంలో రూపొందుతున్న ఉమెన్ సెంట్రిక్ మూవీ లో శ్రియ శరణ్ మూగ యువతీ గా నటిస్తున్నారు. ఇలా డిఫరెంట్ పాత్రలలో నటిస్తూ టాలీవుడ్ లో ఒక నూతన మార్పు కు కృషిచేస్తున్న కథానాయికలకు అభినందనలు తెలపాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 8 =