‘ఎంత మంచివాడవురా’ షూటింగ్ పూర్తి

Entha Manchivaadavuraa Movie Shooting Wrapped Up,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Entha Manchivaadavuraa Movie Shooting Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News,Kalyanram Entha Manchivaadavuraa Movie

‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఆఖరి షెడ్యూల్ కోసం కేరళలోని మున్నార్ కు వెళ్ళింది చిత్రయూనిట్. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఆఖరి షెడ్యూల్ ను కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు షూటింగ్ పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది చిత్రబృందం తెలియచేసింది.

కాగా ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 12 =