“రంగమార్తాండ” మూవీ లో స్టార్ కమెడియన్

Star Comedian Brahmanandam Makes A Comeback With Rangamarthanda Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rangamarthanda Movie Updates,Rangamarthanda Telugu Movie Latest News,Senior Actor Brahmanandam Makes A Comeback With Rangamarthanda Telugu Movie,#Rangamarthanda

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న “రంగమార్తాండ” మూవీ షూటింగ్ నిన్న వైజాగ్ లో ప్రారంభమయింది. మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రూపొందుతున్న” రంగమార్తాండ” మూవీ ప్రారంభోత్సవం లో డైరెక్టర్ తేజ పాల్గొని ఫస్ట్ షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టారు. అనసూయ
భరద్వాజ్ ఒక కీలక పాత్ర కు ఎంపిక అయ్యారు. అభిషేక్, మధు నిర్మాణసారథ్యంలోరూపొందుతున్న”రంగమార్తాండ” మూవీ కి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్క్రీన్ పై ఎవరు కనపడగానే ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తారో ఆయనే స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. 1000 పైగా సినిమాలలో నటించి తన కామెడీ తో ప్రేక్షకులను అలరించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్నిబ్రహ్మానందం అందుకొన్నారు . లెజండరీ యాక్టర్, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం “రంగమార్తాండ” మూవీ లో ప్రేక్షక హృదయాలను హత్తుకొనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని దర్శకుడు కృష్ణవంశీ ట్వీట్ చేశారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ 21 సంవత్సరాల తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =