మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు మనోజ్ కు తన సినీ కెరీర్ చెప్పుకోతగ్గ బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి కూడా లేదని చెప్పొచ్చు. కొంతకాలంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడంతో ఇటీవలే మంచు మనోజ్ విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. దాంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్న సంగతి కూడా విదితమే. ఇకపోతే విడాకుల అనంతరం తాను మాళ్ళీ తనకు ఇష్టమైన ఇండస్ట్రీలోకి వచ్చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సారి హీరోగా కాకుండా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ‘ఎమ్‌ఎమ్ ఆర్ట్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి.. ఆ బ్యానర్ లో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. కొత్త టాలెంట్ కు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టానని… భవిష్యత్ లో మా నిర్మాణ సంస్థ నుంచి వచ్చే మంచి చిత్రాలను మీరు చూస్తారని ఇంతకుముందే తెలిపాడు.
ఇదిలా ఉండగా ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే మరో పక్క తన కొత్త సినిమాలను లైన్ పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తన మేక్ ఓవర్ ను పూర్తిగా మార్చేశాడు. అంతేకాదు ఈ సినిమా వివరాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నట్టు సమాచారం.
Almost set for the shoot 🎦
Details will be announced very soon!
Now this single boy is getting ready to mingle with you all 😜😍
Tvaralone kaluddam… kummeddham 💪🤗 pic.twitter.com/zdSsP1CZok— MM*🙏🏻❤️ (@HeroManoj1) November 25, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: