‘రంగ మార్తాండ’ షూటింగ్ ప్రారంభం

Rangamarthanda Movie Shoot Begins,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rangamarthanda Movie Shooting Details,Rangamarthanda Movie Updates,Rangamarthanda Movie Latest News,Director Krishna Vamsi Rangamarthanda Movie

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ‘రంగ మార్తాండ’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉండగా నేడు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ విషయాన్నీ కృష్ణవంశీ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఫస్ట్ షాట్ ను సెన్సేషనల్ డైరెక్టర్.. నా చిరకాల మిత్రుడు తేజ డైరెక్ట్ చేసాడు.. థాంక్యూ తేజ అంటూ ట్వీట్ చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. అనసూయ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ‘అంతఃపురం’ సినిమాకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా మరోసారి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. చాలా ఏళ్ళ తరువాత ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ జ‌ట్టు క‌ట్టారు.

 

టాలీవుడ్‌లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ.. గతకొద్ది కాలంగా ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయిన సంగతి తెలిసిందే. ‘చందమామ’ తర్వాత ఆ స్థాయి హిట్టు ఇవ్వలేకపోయాడు. మరి ఈ సినిమాతో అయినా మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =