అప్పుడే మొదలైన మహేష్ మేనియా – భారీ కటౌట్ ఏర్పాటు..!

Mahesh Babu Fans Hungama Begin,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Super Star Mahesh Babu Fans Hungama,Mahesh Babu Sarileru Neekevvaru Fans Hungama,Mahesh Babu Latest News 2019

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా అప్పుడు మహేష్ మేనియా స్టార్ట్ అయిపోయింది. రిలీజ్ కు ఇంకా ఏడువారాల సమయం ఉన్నప్పటికీ మహేష్ అభిమానులు ప్రచార సందడి ప్రారంభించేశారు. దీనిలోభాగంగానే హైదరాబాద్‌లోని సుదర్శన్ 35ఎంఎం వద్ద మహేష్ బాబు 81 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. దాదాపు 80అడుగులకు పైగా ఉన్న ఈ కట్ అవుట్ ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు హంగామా ఎలా ఉంటుందో..!

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + eleven =