సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజా గా టీజర్ ను రిలీజ్ చేసింది. ఇక టీజర్ అలా రిలీజ్ చేసారో లేదో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కానీ విధంగా ఈ టీజర్ ఆల్ టైం రికార్డ్స్ బద్దలు కొట్టేస్తుంది. టీజర్ క్లాస్ మాస్ అభిమానులను బాగా ఆకర్షించడంతో సోషల్ మీడియాలో దుమ్ము దులిపే రికార్డులు సృష్టిస్తూ…రికార్డులను సృష్టిస్తూ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలైన 9 నిమిషాలలోనే 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను దక్కించుకున్న ఈ సినిమా టీజర్ రియల్ టైం లో కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. టీజర్ రిలీజ్ అయి మూడు రోజులు అవుతున్నా ఇంకా టాప్ 1 ట్రెండింగ్ లోనే వుంది. అతి తక్కువ సమయంలోనే 10 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ సెట్ చేసిన.. ఈ సినిమా 24 గంటల్లోనే 18 మిలియన్ వ్యూస్ సాధించి టాప్ వన్ ట్రెండింగ్ లో ఉంది. 40 గంటల్లో 20 మిల్లియన్ వ్యూస్ ను దక్కించుకుంది. మరి సోషల్ మీడియాలో టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంక్రాంతికి అప్పుడే మహేష్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టు అనిపిస్తుంది.
కాగా ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: