
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 61


యన్టీఆర్ ‘గండికోట రహస్యం’కు 50 ఏళ్ళు

జూన్ నుంచి రానా, సాయిపల్లవి కాంబినేషన్ మూవీ?

జూన్ నుంచి సాయి తేజ్, మారుతి చిత్రం?

నాగ చైతన్య చిత్రంలో కార్తికేయ?

హీరో శర్వానంద్ కు కోలీవుడ్ ఆఫర్

ప్రయోగాత్మక చిత్రంలో మహేష్ హీరోయిన్

ఆర్ఆర్ఆర్ - ఇంట్రెస్టింగ్ పాత్రలో నిత్యా..!

మహర్షి జ్యూక్ బాక్స్ రిలీజ్

ఎన్జీకే ఆడియో రిలీజ్
మూడు సినిమాల్లో కామన్ పాయింట్

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అప్ డేట్

జెర్సీ 11 డేస్ కలెక్షన్స్

అల్లు శిరీష్ కు అరుదైన అవార్డ్

చిరంజీవి `ఇద్దరు మిత్రులు`కి 20 ఏళ్ళు

‘96’ రీమేక్ అప్‌డేట్స్

కేరళ అడవుల్లో ‘సైరా’ పోరాట ఘట్టాలు

సరికొత్త తరహాలో ‘సాహో’ యాక్షన్ సీన్స్

మీ పాత ప్రభాస్ నే -ప్రభాస్

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా అగ్ర హీరో, యంగ్ హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లి సినిమా 'మహర్షి' రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది.. మహేష్ అభిమానుల్లో ఉత్సుకత కూడా ఎక్కువవుతుంది. గత కొద్ది కాలం నుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగిస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నక్లెస్ రోడ్డు లోని పీపుల్ ప్లాజా లో సాయంత్రం 6గంటలకు గ్రాండ్ గా జరుగనుంది.

యన్టీఆర్ ‘గండికోట రహస్యం’కు 50 ఏళ్ళు
మహానటుడు స్వర్గీయ యన్.టి.రామారావు, జానపద బ్రహ్మ బి.విఠలాచార్య కలయికలో పలు జానపద చిత్రాలు రూపొంది ఘనవిజయం సాధించాయి. వాటిలో ‘గండికోట రహస్యం’ ఒకటి. “ప్రజలే ప్రభువులు” అన్న మహోన్నతమైన సందేశంతో తెరకెక్కిన చిత్రమిది. యన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో జయలలిత, దేవిక కథానాయికలుగా నటించారు. డి.వి.యస్.ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.యస్.రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాజనాల, మిక్కిలినేని, రాజబాబు, అల్లు రామలింగయ్య, హేమలత, రమాప్రభ, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు.

జూన్ నుంచి రానా, సాయిపల్లవి కాంబినేషన్ మూవీ?
రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో ‘విరాటపర్వం 1992’ పేరుతో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ‘నీది నాది ఒకే కథ’తో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల… ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో… రానా విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం… ఈ సినిమాకి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం… జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని టాలీవుడ్ టాక్.

జూన్ నుంచి సాయి తేజ్, మారుతి చిత్రం?
‘చిత్రలహరి’ అందించిన విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు మెగా హీరో సాయితేజ్. ఈ నేపథ్యంలో… తన తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా… తాజాగా యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయితేజ్. జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని సమాచారం.

నాగ చైతన్య చిత్రంలో కార్తికేయ?
‘ప్రేమతో మీ కార్తీక్’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు కార్తికేయ. అయితే… గత ఏడాది నూతన దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘RX 100’తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ఒకవైపు హీరోగా నటిస్తూనే… మరోవైపు కీలక పాత్రల్లోనూ నటించడానికి కార్తికేయ ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో… తనకు నటుడిగా మంచి బ్రేక్ ఇచ్చిన అజయ్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే హీరోగా కాకుండా… అతిథి పాత్రలో నటిస్తున్నాడట.

హీరో శర్వానంద్ కు కోలీవుడ్ ఆఫర్
రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు వంటి ఘన విజయం సాధించిన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్న హీరో శర్వానంద్, ఇతర యంగ్ హీరోల వలే ఇతర భాషలలో తన మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నారు. సురేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని , తమిళ్ సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో శర్వానంద్ జాయిన్ అయ్యారు.

ప్రయోగాత్మక చిత్రంలో మహేష్ హీరోయిన్
కృతి సనన్… సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమైన అందాల భామ. అనంతరం ‘హీరోపంతి’ (‘పరుగు’ రీమేక్) చిత్రంతో బాలీవుడ్‌లో కూడా తొలి అడుగులు వేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ప్రస్తుతం హిందీ సినిమాల్లోనే నటిస్తూ… నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది కృతి. ఈ నేపథ్యంలో… తాజాగా ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కృతి.

ఆర్ఆర్ఆర్ - ఇంట్రెస్టింగ్ పాత్రలో నిత్యా..!
బాహుబలి తర్వాత దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి, తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో రామ్ చరణ్‌కు అలియా భట్‌ను ఎంపిక చేసిన రాజమౌళి, ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్‌ని దించగా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం హీరోయిన్‌ను వెతికే వేటలో ఉంది ఆర్ఆర్ఆర్ టీమ్.

మహర్షి జ్యూక్ బాక్స్ రిలీజ్
మహేష్ బాబు సిల్వర్ జూబ్లి సినిమా మహర్షి కోసం అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రమోషన్ లో భాగంగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఐదు పాటలను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మే 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మే 9 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా జ్యూక్ బాక్స్ ను కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.

ఎన్జీకే ఆడియో రిలీజ్
7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలేవేరులే, యుగానికి ఒక్కడు సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీ రాఘవ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న సినిమా ఎన్జీకే (నంద గోపాల కృష్ణ). ఈ సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక బొమ్మ గీసేవాడు వాడి కొడుక్కి బొమ్మ గియ్యడం నేర్పిస్తే, మా నాన్న మిలట్రీరా, గోలీలాడుకోడం నేర్పిస్తాడా.. రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకి, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి దేన్నైనా నిలదీసి అడిగే హక్కుంది.. అంటూ సూర్య చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి.
మూడు సినిమాల్లో కామన్ పాయింట్
అవెంజర్స్ ఎండ్ గేమ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈసినిమా ప్రభంజనమే కనిపిస్తుంది. సినిమా రిలీజ్ కు ముందు.. సినిమా రిలీజ్ తరువాత కూడా ఈసినిమా తన సత్తా చాటుతుంది. ఇక ఈ సినిమా వస్తుందని.. తమ కలెక్షన్లకు ఎక్కడ దెబ్బ పడుతుందో అని కొన్ని సినిమాలు తన రిలీజ్ డేట్ లను కూడా మార్చేసుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ చూస్తుండే.. ఆ సినిమాలు భయపడటంలో తప్పేంలేదనిపిస్తుంది. ఏప్రిల్ 26న రిలీజైన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 8400 కోట్లు సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అప్ డేట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా షూటింగ్ మాత్రం ఎలాంటి బ్రేక్ లు లేకుండా చాలా ఫాస్ట్ గా జరుపుకుంటుంది. ఇప్పటికే పలు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తాాజాగా హైదరాబాద్ లో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

జెర్సీ 11 డేస్ కలెక్షన్స్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో నాని నటించిన జెర్సీ సినిమా.. నాని కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచింది. న్యాచురల్ స్టార్ అన్న తన బిరుదుకు న్యాయం చేస్తూ.. తన సహజసిద్ధమైన నటన, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడమే కాకుండా వాళ్లతో కంటతడి పెట్టించాడు. ఇక కలెక్షన్స్ కూడా బాగా రాబడుతుంది. 11 రోజుల్లో ఈ సినిమా 25 కోట్లకి పైగా వసూలు చేసి.. ఈ సినిమా లాభాల బాటపట్టనుందని అంటున్నారు. మరి ఈ 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా జెర్సీ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

అల్లు శిరీష్ కు అరుదైన అవార్డ్
టాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోలు ఉన్నా.. వారెవ్వరికీ దక్కని అరుదైన అవార్డ్ అల్లు వారబ్బాయి శిరీష్ కు దక్కింది. ఇంతకీ ఆ అవార్డ్ ఏంటనుకుంటున్నారా?.. ‘క్రాసోవర్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఆయనకు దక్కింది. అది కూడా కేరళలో. మోహన్‌లాల్‌తో కలిసి ‘1971’ చిత్రంలో నటించినందుకు గానూ, అల్లు శిరీష్‌ను ఈ అవార్డు వరించింది. కేరళలోని కొచ్చిలో జరుగుతున్న లులు ఫ్యాషన్ వీక్‌లో ‘క్రాసోవర్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఆయన అందుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడు శిరీష్ కావడం.

చిరంజీవి `ఇద్దరు మిత్రులు`కి 20 ఏళ్ళు
మాతృత్వానికి మగరూపానివై నాన్నతనంలో కణ్వుడివై... అన్నగుణంలో కృష్ణుడివై బతుకంతా జతగా నిలిచే విధిలో పతినే మించిన తోడువై బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా… ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహాన్ని అచ్చ తెలుగు పదాలతో ఆవిష్కరించిన స్నేహగీతికలోని చివరి పంక్తులివి. ఆ పాట… బంగారం తెచ్చి వెండివెన్నల్లో ముంచి కాగా… ఆ చిత్రం ఇద్దరు మిత్రులు (1999).

‘96’ రీమేక్ అప్‌డేట్స్
తమిళంలో ఘన విజయం సాధించిన ‘96’ ను… తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మిస్తున్నాడు. తమిళ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమార్ తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

కేరళ అడవుల్లో ‘సైరా’ పోరాట ఘట్టాలు
బ్రిటీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను ఆవిష్కరిస్తూ భారతీయ తెరపై పలు చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు… ఈ జాబితాలో మరో చిత్రం చేరుతోంది. అదే… ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తరం తెలుగు పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

సరికొత్త తరహాలో ‘సాహో’ యాక్షన్ సీన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే… పోరాట ఘట్టాలకు పెద్దపీట వేసిన ఈ సినిమాలో… 90 శాతం యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ డూప్ లేకుండా నటించాడట. అంతేకాదు… కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. ఇవి మాత్రమే కాకుండా… ఈ సినిమాకు సంబంధించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను బాలీవుడ్ మీడియాతో పంచుకున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో సరికొత్త యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దినట్టు ప్రభాస్…

మీ పాత ప్రభాస్ నే -ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక ధీర రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన బాహుబలి, బాహుబలి 2 మూవీస్ ఘనవిజయం సాధించి అనేక రికార్డ్స్ నెలకొల్పి, ప్రపంచవ్యాప్తం గా ఇండియన్ సినిమా సత్తా ను చాటాయి. ఈ మూవీస్ తో ప్రభాస్ కు సూపర్ స్టార్ స్టేటస్ వచ్చింది. ప్రభాస్ కాకుండా వేరేఎవరైనా అయితే అనేక చిత్రాలకు అంగీకారం తెలిపేవారు. కానీ ప్రభాస్ నిదానమే ప్రధానం అన్నట్టుగా సుజీత్ దర్శకత్వంలో బహు భాషా చిత్రం సాహో కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కింగ్ నాగార్జున ను ప్రశంసించిన రకుల్ ప్రీత్ సింగ్
మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ పై కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సూపర్ హిట్ మూవీ మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్, తమిళ నటి దేవదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మన్మథుడు 2 మూవీ ప్రస్తుతం పోర్చుగల్ దేశంలో జరుగుతుంది. కింగ్ నాగార్జున తో ఫస్ట్ టైమ్ నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున పై ప్రశంసల వర్షం కురిపించారు.