బాహుబలి తర్వాత దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి, తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో రామ్ చరణ్‌కు అలియా భట్‌ను ఎంపిక చేసిన రాజమౌళి, ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్‌ని దించగా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం హీరోయిన్‌ను వెతికే వేటలో ఉంది ఆర్ఆర్ఆర్ టీమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. నిత్యా మీనన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గిరిజన యువతిగా నిత్యా మీనన్ నటిస్తుందని… ఎన్టీఆర్ ను ఆరాధించే పాత్రలో నిత్యామీనన్ నటించనుందని అంటున్నారు. ఎన్.టీ.ఆర్, నిత్యామీనన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ఎంతో కీలకం కానున్నాయని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించేంత వరకూ ఆగాల్సిందే.
కాగా స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సముద్రఖని నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30 న విడుదలకానుంది..
[subscribe]
[youtube_video videoid=WahpR5yMmb8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: