కృతి సనన్… సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమైన అందాల భామ. అనంతరం ‘హీరోపంతి’ (‘పరుగు’ రీమేక్) చిత్రంతో బాలీవుడ్‌లో కూడా తొలి అడుగులు వేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ప్రస్తుతం హిందీ సినిమాల్లోనే నటిస్తూ… నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది కృతి. ఈ నేపథ్యంలో… తాజాగా ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కృతి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సరోగసి నేపథ్యంలో ఓ హిందీ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కృతి ప్రధాన పాత్ర పోషించనుందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో… కథ నచ్చడంతో ఈ సబ్జెక్ట్‌కు వెంటనే ఓకే చెప్పినట్టు కృతి తెలిపింది. కృతి నాయికగా నటించిన ‘రాబ్తా’, ‘లుకాచుప్పి’, ‘అర్జున్ పాటియాలా’ వంటి చిత్రాలను నిర్మించిన దినేష్ విజన్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నాడని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే… కృతి నటించిన ‘అర్జున్ పాటియాలా’, ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా… అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్ మూవీ ‘పానిపట్’ షూటింగ్ దశలో ఉంది. మరి… ప్రయోగాత్మక చిత్రంలో కృతి ఏ మేరకు అలరిస్తుందో చూద్దాం…
[subscribe]
[youtube_video videoid=veEDGytk7QM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: