మూడు సినిమాల్లో కామన్ పాయింట్

Baahubali and Avengers Has A Common Point,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Baahubali and Avengers Movie Released on April Latest Week,Telugu Film Industry Recollecting the Memories in April Month,What is the Common Point Between Baahubali and Avengers,April Month is Lucky For TFI,Tollywood Films are Mostly to Release in April
Baahubali and Avengers Has A Common Point

అవెంజర్స్ ఎండ్ గేమ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈసినిమా ప్రభంజనమే కనిపిస్తుంది. సినిమా రిలీజ్ కు ముందు.. సినిమా రిలీజ్ తరువాత కూడా ఈసినిమా తన సత్తా చాటుతుంది. ఇక ఈ సినిమా వస్తుందని.. తమ కలెక్షన్లకు ఎక్కడ దెబ్బ పడుతుందో అని కొన్ని సినిమాలు తన రిలీజ్ డేట్ లను కూడా మార్చేసుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ చూస్తుండే.. ఆ సినిమాలు భయపడటంలో తప్పేంలేదనిపిస్తుంది. ఏప్రిల్ 26న రిలీజైన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 8400 కోట్లు సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడ గమనిస్తే ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా కనిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టిన సినిమా. ఈ సినిమా 2017 ఏప్రిల్‌ 29న (శుక్రవారం) విడుదలైంది. ఇక హాలీవుడ్ సినిమాలు ‘అవెంజర్స్‌:ఇన్ఫినిటీ వార్‌’, ‘అవెంజర్స్‌:ఎండ్‌గేమ్‌’ సినిమాలు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాయి. ఇన్ఫినిటీ వార్ కంటే ఎండే గేమ్ క్రేజ్ పరంగా.. కలెక్షన్ల పరంగా ఇంకా దూసుకుపోతుంది.

అయితే ఈ మూడు చిత్రాల్లోనూ ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అదేంటి అనుకుంటున్నారా.. ‘బాహుబలి 2’ సినిమా 2017 ఏప్రిల్‌ 29న (శుక్రవారం) విడుదలైంది. ‘అవెంజర్స్‌:ఇన్ఫినిటీ వార్‌’ 2018 ఏప్రిల్‌ 27న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘అవెంజర్స్‌:ఎండ్‌గేమ్‌’ 2019 ఏప్రిల్‌ 26న (శుక్రవారం) విడుదలైంది. ఈ మూడు బ్లాక్‌బస్టర్లు ఒకే నెలలో విడుదలయ్యాయి.. అది కూడా ఏప్రిల్‌ చివరి వారంలో వచ్చే శుక్రవారంలోనే. ఈ మూడు సినిమాలు ఏప్రిల్ లో విడుదలై మంచి ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి.

ఇక ఇదే ఏప్రిల్ లో ఈ ఏడాది వచ్చిన మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలు కూడా మంచి హిట్టయ్యాయి. ఏప్రిల్ 5, ఏప్రిల్ 12, ఏప్రిల్ 19 ఇలా వారం వారం రోజుల గ్యాప్ లో వచ్చిన ఈ మూడు సినిమాలు మంచి హిట్టవ్వడమే కాదు.. ముగ్గురు హీరోలకు హిట్ట అవసరమైన సమయంలో హిట్స్ అందించాయి. మొత్తానికి ఏప్రిల్ నెల సినిమాలకు లక్కీ నెల అని చెప్పొచ్చేమో..

[subscribe]


[youtube_video videoid=PT5sf9Y4iMc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 3 =